Union Minister Nirmala Sitharaman 74 minutes Budget 2025 Speech: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం 8వ సారి. అయితే నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.
నిర్మలా సీతారామన్.. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దాదాపు 74 నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకుముందు 2024-25 బడ్జెట్‌లో 86 నిమిషాలు ప్రసంగించగా.. 2020-21 ఏడాదిలో 162 నిమిషాలు ప్రసంగించారు.
బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఇవే..
– ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
– కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను నిల్
– వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరట
– 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
– బీమా రంగంలో ఎఫ్‌డీఐ వంద శాతానికి పెంపు
– వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
– గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
– కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంపు