Undavalli Arun Kumar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే

Undavalli Arun Kumar Open Letter to deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలను రాబట్టాలని సూచించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మీ చొరవే కీలకం
తన నాలుగు పేజీల లేఖలో పార్లమెంట్‌లో రాజ్యసభ విభజన జరిగిన తీరును ప్రస్తావించిన ఉండవల్లి, తాను సుప్రీంకోర్టులో దీనిపై వేసిన పిటిషన్‌ పదేళ్లుగా నడుస్తూనే ఉందని వాపోయారు. దీనిపై కేంద్రం కనీసం కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదన్నారు. గతంలో చంద్రబాబుకు చెబితే రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిర్ణయించినా, అది అమలు కాలేదని గుర్తుచేశారు. ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరను గుర్తించి రాష్ట్రానికి న్యాయం చేసే చర్యలు తీ