Kumbh Mela: మహా కుంభమేళా భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

TTD to erect model temple of Lord Venkateswara at Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి ఫిబ్రవరి 26వరకు జరగనున్న మహాకుంభ మేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

45రోజులపాటు సాగే మహాకుంభ మేళాకు 2.5 ఎకరాల విస్తీర్ణంలో నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు జరుపుతామని వెల్లడించారు. యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.