Site icon Prime9

TTD Arjita Seva: భక్తులకు అలర్ట్.. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిలీజ్

TTD Tirumala will release Srivari Arjitha Seva Tickets tomorrow: శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించి తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు టీటీడీ ప్రకటన జారీ చేసింది. మార్చి నెలలో జరిగే సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటా టికెట్లను డిసెంబ‌రు 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టీటీడీ తెలిపింది.

ఈ సేవా టికెట్ల కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, లాటరీలో టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి తమ టికెట్లు పొందొచ్చని తెలిపింది. అలాగే, డిసెంబ‌రు 21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

Exit mobile version