TTD Calendars and Diaries: తిరుమల తిరుపతి దేవస్థానం 2025 సంవత్సరపు శ్రీవారి కేలండర్లు, డైరీలు రెడీ చేసింది. ఈ 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్‌లు, డైరీలు, చిన్న డైరీలను తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రధాన నగరాల్లోని కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికి.. తపాలా శాఖ ద్వారా ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశామని, టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.