Site icon Prime9

Tirumala : వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం… ఎంతంటే?

tirumala hundi revenue on vaikunta ekadasi creating records

tirumala hundi revenue on vaikunta ekadasi creating records

Tirumala : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 7.68 కోట్ల కానుకలను భక్తులు సమర్పించినట్లు టిటిడి వెల్లడించింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2022 అక్టోబర్ 23న వచ్చిన రూ.6.31 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు వచ్చిన అత్యధిక హుండీ ఆదాయం.

అదే విధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం శ్రీవారిని 69,414 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా… 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా 2022 లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా… 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించారు. అలానే 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.

ఇక శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వ తేదీ వరకు కొనసాగనుంది. సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తి ఆలయాలను దర్శించుకున్నారు.

Exit mobile version