Site icon Prime9

Budget: వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్ ప్రవేశపెట్టేది ఆ రోజే!

High Court

High Court

Budget: గవర్నర్ తమిళి సై వ్యవహారంలో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ తీరుపై హై కోర్టుకు వెళ్లిన ప్రభుత్వం.. వెంటనే వెనక్కి తిరిగింది. గవర్నర్ పై దాఖలు చేసిన.. లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభిస్తామని.. ప్రభుత్వం తెలిపింది.

వెనక్కి తగ్గిన ప్రభుత్వం..

గవర్నర్ పై పోరుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది.

ఇక అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని.. ప్రభుత్వ తరఫు న్యాయవాది హై కోర్టుకు తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని కోర్టుకు విన్నవించారు.

ఈ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో.. బడ్జెట్‌ (Budget) తేదీ మార్పుపై కసరత్తు ప్రారంభమైంది. 3వ తేదీకి బదులు.. 6వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది.

లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదంలో తామెలా జోక్యం చేసుకుంటామని హై కోర్టు ప్రశ్నించింది.

న్యాయస్థానం సూచనల మేరకు.. న్యాయవాదులు ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో.. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి కూడా అనుమతి లభించినట్లైంది.

ఇక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌  (Governer ) అనుమతి కూడా లభించనున్నట్లు.. రాజ్‌భవన్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

2023-24 బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపలేదు.

దీంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తక్కువ సమయం ఉండటంతో.. ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

ఆనవాయితీ ప్రకారం.. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు.

గవర్నర్ ప్రసంగం లేకుండానే..

రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ.

ఇందుకు భిన్నంగా గతేడాది బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించారు.
గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించుకునే సాంకేతిక వెసులుబాటు ఉంది.

దీని ద్వారానే ప్రభుత్వం గతేడాది గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ ని ప్రవేశపెట్టారు.

Sukhendhar Reddy : గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar