Site icon Prime9

Date cultivation: 32 రకాల ఖర్జూరాలను సాగుచేసిన తమిళనాడు రైతు

Date cultivation: తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఎస్ నిజాముద్దీన్ అనే 61 ఏళ్ల రైతు ఏకంగా 32 రకాల ఖర్జూరాలను సాగు చేస్తూ ఇతర రైతులకు స్పూర్తిగా నిలిచాడు. అరియాకులం సమీపంలోని తన 12 ఎకరాల పొలంలో అతను ఖర్జూరం సాగు చేశాడు. పదేళ్లకు పైగా ఖర్జూరాన్ని సాగుచేస్తున్న నిజాముద్దీన్ దీనిపై అనుభవాలను షేర్ చేసుకున్నాడు.

నేను మిడిల్ ఈస్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, అక్కడ ఖర్జూర వ్యవసాయం నాకు ప్రేరణగా పనిచేసింది. నేను వివిధ సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నాను కొన్ని మొక్కలతో ధర్మపురికి తిరిగి వచ్చాను. చివరికి నేను ఈ పద్ధతిలో ప్రావీణ్యం సంపాదించాను. ఖర్జూర చెట్టు అనారోగ్యాలు మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులకు నిరోధకతను కలిగి ఉంటుంది. ధర్మపురిలో చాలా పంటలు పండించడానికి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఖర్జూరం అక్కడ బాగా పండుతుంది. చెట్లు పెద్దయ్యాక, అవి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, ఒక చెట్టు మొదటి సంవత్సరంలో 50 కిలోల ఖర్జూరం పండుతుంది. కానీ మూడవ సంవత్సరం నాటికి, అదే చెట్టు దాదాపు 200 కిలోల వరకు ఉత్పత్తి చేస్తుందని నిజాముద్దీన్ వివరించారు. బహ్రియా రకం ఖర్జూరం కిలో రూ. 160 నుండి రూ. 200 వరకు అమ్ముడవుతుంది.

భారతదేశం ప్రపంచ మార్కెట్‌లో దాదాపు 38% ఖర్జూరం దిగుమతి చేసుకుంటోంది. సాంప్రదాయకంగా, ఖర్జూరం యొక్క స్థానిక రకాలు గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతంలోని విత్తనాల ద్వారా సాగు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar