Srikakulam Sherlock Holmes Review: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ రివ్యూ.. ఊహించని ట్విస్టులే ట్విస్టులు!

Srikakulam Sherlock Holmes Review: తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రమణా రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఈ మూవీని క్రిస్మస్ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకుందాం.

కథ:
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఓబ అద్భుతమైన కథ. ఇందులో డిటెక్టివ్ నైపుణ్యాలు, భావోద్వేగ కథనాన్ని పునరుద్ధరించేలా సహాయం చేశాయి. ఈ సినిమా ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకోవడంతో పాటు అక్కడే కట్టిపడేశాయి. అందులో మిస్టరీ, కుటుంబ కథనాలు, ప్రేమ కథలను పర్ఫెక్ట్‌గా చూపించడంతో పాటు డైరెక్టర్ ప్రాణం పోసేలా తీశారు.

కథనం, విశ్లేషణ:
ఈ సినిమాలో సర్వసాధారణంగా నిపుణతతో కూడిన డిటెక్టివ్ పాత్రను చూపించారు. ప్రతి సన్నివేశంలో ఆశ్చర్యకరమైన ట్విస్టులతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ఈ సినిమా ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను చివరివరకు ఆసక్తిగా సాగుతోంది. కథలో ఎన్నో అనుకోని మలుపులు, శ్రద్ధతో నటించిన పాత్రలు ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎవరూ కూడా మిస్టరీని ఊహించకుండా చేసేలా డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

నటీనటులు:
వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్రలో తనదైన శైలిలో అదరగొట్టారు. డిటెక్టివ్ పాత్రలో ఇంటలిజెన్స్, భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను పిండేశాయి. ఇక అనన్య నాగళ్ విషయానికొస్తే ఎంత చెప్పినా తక్కువ. తన సింప్లిసిటీతో మరోసారి ఆకట్టుకుంది. అలావే రవి కూడా తన పాత్రలలో మరింత విలువైన నటనను ప్రదర్శించాడు. ప్రధానంగా ఆత్మీయత, కుటుంబ బంధాలను చక్కగా జోడించారు.

సాంకేతికత వర్గం:
దర్శకుడు రైటర్ మోహన్ ఈ సినిమాను కేవలం డిటెక్టివ్ కథగానే కాకుండా ఓ మానవ సంబంధాల విషయాలను చాలా లోతుగా ఆలోచించే విధంగా చేశాడు. ప్రధానంగా కథలో విషాదం, ప్రేమ, విశ్వాసం, నిజాయితీకి ఇలా అన్ని విషయాల్లో జరుగుతున్న సంఘర్షణ, పోరాటం వంటి అంశాలను గుండెను హత్తుకునేలా ప్రేక్షకులకు అనుభూతిని కలిగించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేసేలా చేశారు. యూనివర్సల్ ఆలోచనలు కలిగిన చిత్రంగా రూపొందించబడింది. అలాగే సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ మూవీలో భావోద్వేగాలు మరింత కాప్చర్ చేశాయి. ఎడిటింగ్ హార్మనియస్‌గా ఉండగా.. విజువల్స్, మేకింగ్ వాల్యూస్, బీజీఎం బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
• అద్భుతమైన ట్విస్టులు, గూఢచారి కథ
• భావోద్వేగాలను హృదయపూర్వకంగా చూపిన స్క్రీన్‌ప్లే
• నటీనటుల అద్భుతమైన ప్రదర్శన
• కథను ముందుకు తీసుకెళ్లే పాటలు

మైనస్ పాయింంట్స్..

కొంతమంది ప్రేక్షకులను భావోద్వేగాలు అంతగా ప్రభావం చూపించకపోవచ్చు అయితే ఇది సినిమాకు పెద్ద లోపం కాకపోవచ్చు.

చివరగా..
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక ఆత్మీయత, భావోద్వేగాల కలిపిన స్టోరీ. ఇందులో ప్రధానంగా డిటెక్టివ్ కథతో సమన్వయంగా చూపించారు. స్క్రీన్‌ప్లే, సాంగ్స్, నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆత్మీయత, మిస్టరీ, కామెడీ సమానంగా పండింది.

రేటింగ్: 2.75/5