Sridevi Drama Company : ఇరు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతున్న ప్రోగ్రామ్ లలో ఈటీవీలో ప్రసారమవుతున్న వినోదభరిత కార్యక్రమం ” శ్రీదేవి డ్రామా కంపెనీ“. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఎంటర్టైన్మెంట్ షోల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ షో లో కూడా దాదాపు జబర్దస్త్ షో లో కమెడియన్స్ వారి వారి శైలిలో అలరిస్తూ ఉంటారు. ఈ షో కి యాంకర్ గా రష్మి చేస్తుండగా.. జడ్జిగా ఇంద్రజ చేస్తుంది.
కాగా జబర్దస్త్ షోకు పనిచేసిన యాంకర్లు, కమెడియన్లు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షోలో పేరు తెచ్చుకున్న పలువురు కమెడియన్లు హీరోలుగా, నటులుగా సిల్వర్ స్క్రీన్ పై కూడా పేరు తెచ్చుకున్నారు. అలానే ఈ ప్రోగ్రామ్ ద్వారా పలు జంటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. వారిలో ముఖ్యంగా మనకు బాగా వినిపించే పేర్లలో సుధీర్ – రష్మి, వర్ష – ఇమ్మానుయేల్, ఆసియా- నూకరాజు, రాకేశ్ – సుజాత, ఇక రాకేశ్ – సుజాత అయితే ఇటీవలే ఒక ఇంటివారు కూడా అయ్యారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో గమనిస్తే వర్ష-ఇమ్మానియేల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు కనబడుతుంది. దీనికి హైపర్ ఆది కారణం అని ఇమ్మానుయేల్ చెప్పడం అందరికీ షాక్ కి గురి చేసింది. దీనికి సంబంధించిన పూతి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
నా మీద నీకు అంత డౌట్ ఎందుకు ఇమ్మానియేల్ (Sridevi Drama Company) – వర్ష
తాజాగా రిలీజ్ అయిన ప్రోమో గమనిస్తే.. మొదటి నుంచి సరదాగా సాగిన షో లో వర్ష వేరొక వ్యక్తితో రీల్స్ చేసిందని ఇమ్మానియేల్ కి ఆది చెప్పాడు. ఛస్తే చేయదు.. నేను నమ్మను అని ఇమ్మానియేల్ అన్నాడు. దాంతో చూడు అంటూ.. వర్ష ఓ అజ్ఞాత వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలు చూసిన ఇమ్మానియేల్ ఆగ్రహానికి గురై వర్షని ఎవడే వాడంటూ నిలదీశాడు. అసలు రియల్ లవర్ ఎవరు? వాడా ? నేనా? లేక వీడా ??? అని ఫైర్ అయ్యాడు. అందుకు వర్ష.. నా మీద నీకు అంత డౌట్ ఎందుకు ఇమ్మానియేల్ నీకు అని వర్ష చెబుతుంది. నిజంగానే ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా వర్షా? అని ఎదురు ప్రశ్నించాడు ఇమ్మానియేల్. దీనంతటికీ కారణం నువ్వే అంటూ ఇమ్మానుయేల్.. ఆది మీద ఫైర్ అయ్యాడు.
అయితే ఇదంతా ఫన్ లో భాగంగానే జరిగినట్లు తెలుస్తుంది. అదే విధంగా రియల్ కపుల్ రాకింగ్ రాకేష్-సుజాతల మధ్య రొమాంటిక్ మూమెంట్స్ తో కూడా ఈ ప్రోమో లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఇటీవల నాకు ఎంగేజ్మెంట్ అంటూ థంబ్ నైల్ పెట్టి యూట్యూబ్ వీడియో విడుదల చేసింది. వీడియో చివర్లో నాది కాదు, రాకింగ్ రాకేష్, సుజాలది అంటూ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో నెటిజెన్స్ ఆమె మీద గట్టిగా ట్రోల్స్ చేశారు.