Sri Rama Navami: నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరి శ్రీరామ నవమి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పరిపూర్ణ పురుషోత్తముడు
నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరి శ్రీరామ నవమి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుత్ర కామేష్టియాగ ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు.
ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. రావణ సంహారం కొరకు.. రాముడు వచ్చాడని తెలుస్తోంది. రాముడి జనన సమయానికి రావణుడు.. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అరణ్యవాసం.. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని.. దేశవ్యాప్తంగా ఆలయాల్లో సీతారామ కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలం.. ఏపీలో ఒంటిమిట్ట రామాలయంలో ఈ వేడుకలు అంబరాన్ని అంటుతాయి.
పితృవాక్య పరిపాలకుడిగా.. ప్రజల కోసం రాజుగా, భార్య కోసం తపించిన భర్తగా ఇలా సకల గుణాలు రాముడి సొంతం. క్రమశిక్షణ, వీరత్వం, సాహసం.. రాముడి లక్షణాలు.