Site icon Prime9

Sankranthi Sambaralu: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు.. ఓ రేంజ్ లో పెరిగిన హోటల్ ధరలు

Sankranti in bhimavaram

Sankranti in bhimavaram

Sankranthi Sambaralu: మామూలుగా లాడ్జీలో ఒక రోజుకి రూ.1000 చార్జీ చేస్తారు. ఒక వేళ రద్దీ టైంలో 2 వేల నుంచి 3వేల వరకు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో మూడు రోజుల వసతి 25 వేలు పలుకుతోంది.

ఓ మోస్తారు హోటల్ రూమ్ ల కోసం ఇప్పుడు పలుకుతున్న రేటు అది. ఇంకొంచెం లక్జరీ హోటల్స్ రెంట్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు ఓ రేంజ్లో జరుగుతాయి. ఈ సందర్భంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు జరగడం ఆనవాయితీ గా వస్తోంది.

పండగ సందర్భంగా బంధువులతో పాటు స్నేహితులను తమ ప్రాంతానికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేయడం ఇక్కడ కామన్.

ఎక్కడ చూసినా నో రూం బోర్డులు

ముఖ్యంగా కోడిపందాల కోసం భారీ సంఖ్యలో ఇక్కడకు రావడంతో ఈ పండుగ మూడు రోజులు ఇక్కడ రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఇక భీమవరంలో ఏ హొటల్ , లాడ్జీల్లో చూసినా నో రూం బోర్డులు కనిపిస్తున్నాయి. రెండు మూడు నెలల ముందే ఫుల్ పేమంట్ తో రూమ్ లు బుక్ అయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

ఒకవేళ రూమ్స్ అందుబాటులో ఉన్నా ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రోజు వారీ అద్దెలు కాకుండా మూడు, నాలుగు రోజుల ప్యాకేజీ తీసుకోవాలని.. అందుకు 25 వేల నుంచి 30 వేల వరకు ముందే పేమెంట్స్ చేయాలని కండిషన్ పెడుతున్నారు.

దీంతో ఇక్కడకు వచ్చిన అతిధులు రూమ్ లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. డిమాండ్ ను అదునుగా చూసుకుని ఇష్టం వచ్చినట్టు అద్దెలు పెంచడం దారణమని మండిపడుతున్నారు.

ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ

ముందుగా బుక్ చేసుకున్న వారితో హోటళ్లు ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడా గదులు దొరకడం లేదు. దీంతో కొందరు రాజకీయ నాయకులతో రెకమెండ్ చేసుకుంటున్నారు.

ఇక్కడ జరిగే కోడిపందాల కోసం పలు ప్రాంతాల నుంచి సాధారణ ప్రజలతో వీఐపీలు వస్తారు. దీంతో హోటల్ నిర్వాహకులపై వీఐపీల ఒత్తిడి ఎక్కువ అయింది. అదేవిధంగా పోలీసులు, స్థానికంగా ఉండే ఫ్రెండ్స్ ను ఉపయోగించుకుని కూడా గదులు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కొంతమంది గదుల కోసం ఎంతైన ఖర్చు పెడతామని ముందుకు వస్తున్నారు. 2 వేల నుంచి 3 వేల వరకు ధర పలికే గదులన్నీ ఇప్పుడు దాదాపు 20 వేల నుంచి 35 వేల వరకు పలుకుతున్నాయి. అయినా తీసుకుంటామని వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సమాచారం.

గోదావరి రుచులతో స్పెషల్ మెనూ

అతిధుల కోసం రెస్టారెంట్ లు వివిధ రకాల వంటకాలతో మెనూను రెడీ చేస్తున్నాయి. గోదావరి జిల్లాల స్పెషల్ సీఫుడ్ తో పాటు రాయలసీమ, తెలంగాణ వంటకాలను తయారు చేస్తున్నారు. పలు రెస్టారెంట్లు సంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి గోదావరి జిల్లాలు సందడి సందడి గా మారాయి.

ప్రత్యేకంగా నాటుకోడి, పీతలు, కముజు పిట్ట, బొమ్మిడాయలు ఇక్కడ స్పెషల్. కేవలం గోదావరి రుచులను టేస్ట్ చేయడానికి చాలామంది అతిధులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar