Site icon Prime9

Jabardasth : జబర్దస్త్ యాంకర్ కి నెక్స్ట్ లెవెల్ కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

sai dharam tej super counter to jabardasth show anchor

sai dharam tej super counter to jabardasth show anchor

Jabardasth : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా సాయి తేజ్ నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విరూపాక్ష టీం తాజాగా జబర్దస్త్ కామెడీ షో లో సందడి చేసింది.

తాజాగా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ మేరకు జబర్దస్త్ షో లో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, డైరెక్టర్ కార్తీక్ దండు పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుకి గట్టి షాక్ ఇచ్చాడు. ఈ వీడియోలో సాయిధరమ్ తేజ్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వగానే.. చీర కట్టులో అందంగా మెరిసిపోతున్న యాంకర్ సౌమ్య రావు మీద సెటైర్లు వేశాడు. సాయి ధరమ్ తేజ్ సౌమ్య రావు వైపు చూస్తూ ఏంజిల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నా అని అంటాడు. దీనితో సౌమ్య రావు సిగ్గుతో మురిసిపోయింది. అయితే వెంటనే సాయి ధరమ్ తేజ్.. మీ గురించి కాదు లేండి అని అనడంతో ఒక్కసారిగా స్టన్ అయ్యింది. ఇక షో ఆద్యంతం కమెడియన్లతో కలిసి సాయి తేజ్ కూడా తనదైన శైలిలో అందర్నీ అలరించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

గత 8 సంవత్సరాల నుండి బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కమెడియన్స్ ఇందులో పాల్గొని తమ స్కిట్లతో బాగా నవ్వించారు. ఇక ఇందులో కామెడీ కంటే ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ షో కొనసాగుతోండగా.. ఇప్పటికీ ఆ షోకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. జబర్దస్త్ షోకు పోటీగా మిగత ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ లో చాలా కామెడీ షోలు వచ్చినా.. అవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. వెగటు కామెడీతో మిగతా షోలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. జబర్దస్త్ షోకు పనిచేసిన యాంకర్లు, కమెడియన్లు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సుధీర్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేయగా.. ఆదితో పాటు పలువురు కమెడియన్లు టాలీవుడ్ లో నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రష్మీ, అనసూయ లీడ్ రోల్‌లో పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇక జబర్దస్త్ షో నుంచి యాంకర్ గా అనసూయ తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో సౌమ్యరావ్ తన వంతు వినోదం, గ్లామర్ పంచుతూ అలరిస్తోంది.

Exit mobile version