Sai Dharam Tej : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రేయ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో ఆకట్టుకున్న ఆయన… ‘సుప్రీం’, ‘విన్నర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. అంతలోనే ఆ హీరో జీవితంలో ఊహించలేని ఘటన చోటు చేసుకుంది.
అనుకోని రీతిలో ప్రమాదానికి గురైన సాయి తేజ్ తీవ్ర గాయాలపాలై కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా కొలుకొని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం తన విరూపాక్ష మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యాడు. ఆ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఓ మైదా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన యాక్సిడెంట్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సాయి తేజ్ మాట్లాడుతూ.. ఆ ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. మృత్యువు అంచు వరకు వెళ్లొచ్చిన తనకు ఆ ఘటనను తాను పీడకలగా భావించడం లేదని, అది ఓ లెసన్ గా భావిస్తున్నానన్నారు. అది తనకు ఓ స్వీట్ మెమరీ లాంటిదని వ్యాఖ్యానించారు. దాని వల్ల తాను చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా మాట విలువ తెలిసిందంటూ కామెంట్లు చేశారు. ఆ సమయంలో తనకు గొంతు కూడా సరిగా రాలేదని, కానీ చాలా మండీ తానేదో తాగి మాట్లాడుతున్నానని అనుకోని కామెంట్స్ చేయడం చాలా బాధ పెట్టిందన్నారు. అప్పుడు తనకు తన ఫ్యామిలీ, తోటి హీరోలు ఎంతో ధైర్యం చెప్పారన్నారు. ముఖ్యంగా తన తల్లి తనకు ఎంతో ధైర్యం చెప్పిందని, మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని చెప్పి, బైక్ ఎక్కించిందని గుర్తు చేసుకున్నారు. అలా అన్నీ సెట్ కావడానికి రెండు రోజులు పట్టిందన్నారు.
నీ పనైపోయిందా? ఇక రిటైర్‌మెంటేనా?’ అంటూ (Sai Dharam Tej)..
తల్లిదండ్రుల దగ్గర నుంచి అభిమానుల దాకా ఎంతోమంది తాను కోలుకోవాలని ప్రార్థించారని, వారి ప్రార్థనల కారణంగానే తాను బతికి బయటపడ్డానని సాయి తేజ్ చెప్పాడు. తాను ఆర్థికంగా ఎంత సంపాదించానన్న సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకుల అభిమానాన్ని సాధించగలిగానని, జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నాడు. అయితే.. తాను మంచాన పడినప్పుడు కొందరు నెట్టింట్లో తనని దారుణంగా ట్రోల్ చేశాడని గుర్తు చేసుకున్నారు. ఏదో జోకులు వేయాలన్న ఉద్దేశంతో.. ‘నీ పనైపోయిందా? ఇక రిటైర్‌మెంటేనా?’ అంటూ ట్రోల్ చేశారన్నాడు. అయితే ఆ ట్రోల్స్‌కి తానేమీ బాధపడటం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తో కలిసి వినోదాయ సిత్తం సినిమా రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.