Site icon Prime9

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు స్పాట్ డెడ్

Road Accident In Palnadu District 4 Killed: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండంలోని బ్రాహ్మణపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి ఎదురుగా చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పల్పాడు ఎస్పీ శ్రీనివాసరావు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు.  ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, తెలంగాణలోని కొండగొట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగి వస్తుండగా..ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతులు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

ఇదిలా ఉండగా, కొత్తగా కారు కొనుగోలు చేసి నెల రోజులు కూడా కాలేదు. అయితే ఈ కారుకు పూజలు చేసుకొని తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో ప్రణయ్, ఆదిలక్ష్మి, శ్రీనివాస్ రావు, కౌసల్యకు గాయాలయ్యాయి.

 

 

 

Exit mobile version