Site icon Prime9

Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ తొలి పోస్ట్.. వారికి రుణపడి ఉంటానంటూ..

Rishabh pant

Rishabh pant

Rishabh Pant: టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

యాక్సిడెంట్ తర్వాత తొలిసారి పంత్ స్పందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

మైదానంలో కలుద్దాం

‘ప్రస్తుతం చికిత్సలన్నీ పూర్తి అయ్యాయి. కోలుకునే ప్రక్రియ మొదలైంది. సవాళ్లకు సిద్ధంగా ఉన్నాను. బీసీసీఐ, గవర్నమెంట్  అధికారులకు ధన్యవాదాలు.

త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు.. నా ఆరోగ్యం కోసం కష్టపడుతున్న డాక్టర్లకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా.

త్వరలో మైదానంలో కలుద్దాం’ అంటూ పంత్(Rishabh Pant)ట్వీట్ చేశాడు.

 

ఎప్పటికీ రుణపడి ఉంటా..

ప్రమాదం జరిగిన టైంలో వెంటనే స్పందించి తనను కాపాడిన రజత్, నిషూలతకు పంత్ (Rishabh Pant) ఈ సందర్భంగా రిషబ్ పంత్ ధన్యవాదాలు తెలిపాడు.

‘ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పలేను. కానీ ప్రమాద సమమంలో నన్ను కాపాడి.. వెంటనే హాస్పిటల్ కు తరలించిన హీరోలు రజత్ కుమార్ , నిషూ కుమార్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని అన్నాడు.

 

కాగా, గత ఏడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురి అయింది. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోగా.. పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి.

అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పంత్ కు జరిగిన సర్జరీలు అన్నీ విజయవంతం అయినప్పటికీ,

అతను పూర్తిగా కోలుకోవడానికి 6 నెలలు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ దూరమయ్యాడు. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌కు సైతం దూరంగానే ఉండనున్నాడు.

అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశం ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version