Site icon Prime9

Rashmika Mandanna: వీల్‌ఛైర్‌లో పుష్ప-2 హీరోయిన్.. అసలేమైందంటే?

Rashmika Mandanna on Wheelchair at Airport: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె నటించిన పుష్ప-2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ కలెక్షన్లకు రాబట్టింది. ఇందులో రష్మిక నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా, ఫ్యాన్స్‌కు రష్మిక మందన్నా వీల్‌ఛైర్‌లో కనిపించి బిగ్ షాక్ ఇచ్చింది.

నడవలేని స్థితిలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. ఇటీవల జిమ్ములో కసరత్తు చేస్తుండగా.. కాలు బెనికింది. దీంతో గాయం కారణంగా ఆమె నడిచేందుకు ఇబ్బందిగా మారింది. కాలుకి గాయం కావడంతో కొన్ని రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇందులో భాగంగానే ఆమెను వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారు. అయితే రష్మిక మందన్నా మాత్రం తన ముఖం కనిపించకుండా ఓ క్యాప్‌తో చుట్టుకుని కనిపించింది.

ఇదిలా ఉండగా, రష్మికా మందన్నా.. ప్రస్తుతం సికిందర్, చావా, థామా, అనిమల్-2 సినిమాలతో తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘చావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఈ మూవీలో శంభాజ్ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటిస్తుండగా.. శంభాజ్ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించింది. ఇందులో భాగంగానే మంగళవారం రష్మికా మందన్నా లుక్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఛావా ట్రైలర్ ఇవాళ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

Exit mobile version