Site icon Prime9

Orange Movie : రికార్డు సృష్టించిన రామ్ చరణ్ “ఆరెంజ్” మూవీ.. రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్

ram charan orange movie create records in orange movie

ram charan orange movie create records in orange movie

Orange Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో “ఆరెంజ్” మూవీ ఒకటి. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 26న రిలీజ్ అయ్యింది. ఇప్పటి ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో రీ రిలీజ్ లో థియేటర్ లు హౌస్‌ఫుల్ లు అయ్యాయి. 26 వ తేదీ నుంచి ఈ చిత్రానికి.. ఇప్పటికి పలు సెంటర్స్ లో హౌస్ ఫుల్ షోలు పడుతుండడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని రికార్డు సృష్టించింది. ఇంకా షోలు పడుతుండడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఒక ప్లాప్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడంతో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ మేరకు సినిమా నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఒక పోస్టార్ రిలీజ్ చేశారు.

అలానే అంతకు ముందు రీ రీలీజ్  కలెక్షన్స్ అన్నిటిని జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్లు నాగబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పోస్ట్ లో ‘ఆరెంజ్’ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. మెగా అభిమానులు, జన సైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగమై, వినోదంతో పాటు జనసేనను బలపేతం చేసే ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఉన్నాడు. మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ అండ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న చరణ్.. కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉపాసనతో కలిసి దుబాయ్ హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చాక ‘గేమ్ చెంజర్’ షూటింగ్ లో పాల్గొనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, అంజలి పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version