Site icon Prime9

Waltair Veerayya Vijaya Viharam : మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా.. “వాల్తేరు వీరయ్య” విజయ విహారం కోసం మెగా పవర్ స్టార్

ram-charan-going-to-participate-in-waltair-veerayya-vijaya-viharam

ram-charan-going-to-participate-in-waltair-veerayya-vijaya-viharam

Waltair Veerayya Vijaya Viharam : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ “వాల్తేరు వీరయ్య”.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.

ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.

10 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya Vijaya Viharam) ..

బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దుమ్ము లేపుతుంది ఈ చిత్రం.

ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

కాగా మెగాస్టార్ కెరీర్ లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూడో సినిమాగా వాల్తేరు వీరయ్య నిలిచింది.

అంతకు ముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.

మరోవైపు యూఎస్ బాక్సాఫీస్‌ను కూడా వాల్తేరు వీరయ్య చిత్రం షేక్ చేస్తుంది.

వీరయ్య విజయ విహారం..  ఒకే వేదికపై చిరు, చెర్రీ

దీంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.

ఈ మేరకు ఈరోజు (జనవరి 28)  ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఇందుకు గాను హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద సక్సెస్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగనుంది.

అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాబోతుండడం మెగా అభిమానులకు డబుల్ బొనాంజా అని చెప్పాలి.

దీంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే వేదికపై రానుండడం పట్ల ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. చరణ్  మైత్రి మూవీస్ సంస్థలోనే వచ్చిన “రంగస్థలం” చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.

 

 

మెగా ఫ్యామిలీ కి లక్కీగా మైత్రీ మూవీ మేకర్స్..

రాంచరణ్ – రంగస్థలం.. సాయిధరమ్ తేజ్ – చిత్రలహరి.. వైష్ణవ్ తేజ్ – ఉప్పెన.. అల్లు అర్జున్ –  పుష్ప .. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి – వాల్తేరు వీరయ్య.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలు అన్నీ మైత్రి మూవీస్ సంస్థలోనే రావడం గమనార్హం.

త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ కూడా పట్టాలు ఎక్కనుంది.

ఈ సినిమాకి మొదట భవదీయుడు భగత్ సింగ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ పేరు మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని మార్చారు.

మెగా హీరోల్లో అందరితో సాలిడ్ హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్ తో కూడా అదిరిపోయే హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version