Game Changer: రిలీజ్‌కి ముందే ‘గేమ్‌ ఛేంజర్‌’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌ – కళ్లు చెదిరే రేటుకి డిజిటల్‌ రైట్స్‌! ఎన్ని కోట్లో తెలుసా?

  • Written By:
  • Updated On - October 22, 2024 / 08:42 PM IST

Game Changer Movie OTT Rights Goes Viral: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు కంప్లీట్‌ చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ డ్యుయెల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. 2025 జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్‌ని కూడా జరుపుకుంటోంది. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ ఒప్పందం కూడా చేసుకుందని సమాచారం. ఈ మూవీ ఓటీటీ డీల్‌ ఎంతో తెలిసి అంతా అవాక్క్‌ అవుతున్నారు. ఒక్క ఓటీటీకి అన్ని కోట్లు అయితే ఇక థియేట్రికల్‌ రట్్‌, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏ రేంజ్‌లో ఉంటుందోనిన ట్రేడ్‌ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి.

అన్ని కోట్లకు ఓటీటీ రైట్స్‌

లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ డిజిటల్‌ రైట్స్‌ కోసం పలు బడా ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. ఫైనల్‌ భారీ డీల్‌కు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైం విడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సొంతం చేసుకునేందుకు మేకర్స్‌కి అమెజాన్‌ ప్రైం దాదాపు రూ. 170 కోట్లు చెల్లించినట్టు టాక్‌. ఇది తెలుగుతో పాటు ఇతర భాషలకు కలిపి ఈ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ ఒప్పందం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇది తెలిసి ట్రేడ్‌ వర్గాలే సర్‌ప్రైజ్‌ అవుతున్నాయట. గేమ్ ఛేంజర్‌ని చిత్రాన్ని కోనుగోలు చేసినట్టు అమెజాన్‌ ప్రైం ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చింది. అలాగే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడో కూడా స్పస్టం చేసింది అమెజాన్‌. మూవీ పోస్ట్‌ రిలీజ్‌ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని పేర్కొంది.

మరోవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’ని సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సైతం తెగ ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ థియేట్రికల్, శాటిలైట్‌ రైట్స్‌పై మేకర్స్‌తో గట్టిగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ థియేట్రికల్‌ రైట్స్‌ ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ప్రభుత్వం అధికారిగా, ఓ రైతు తండ్రి పాత్రలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా నటి అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నటుడు శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖనితో పాటు తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు.