Pushpa 2 Collections: 11 రోజుల్లోనే కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఆల్‌టైం రికార్డు బ్రేక్‌ – రూ. 2వేల కోట్ల దిశగా ‘పుష్ప 2’ దూకుడు

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 10:57 AM IST

Pushpa 2 11 Days Collections: విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతుంది. ఇక బాక్సాఫీసు వద్ద సునామీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. నార్త్‌లో తక్కువ టైంలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. అలాగే డబ్బింగ్‌ సినిమాను సరికొత్త రికార్డుకు ఎక్కింది. వెయ్యి కోట్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా వసూళ్లు వర్షం కురిపిస్తూ 2 వేల కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. కాగా కేవలం 6 రోజుల్లోనే పుష్ప 2 టార్గెట్‌ రీచ్‌ అయ్యింది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ఫాస్టెస్ట్‌ సినిమాగా సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. విడుదలై రెండు మూడో వారంలోకి అడుగుపెట్టింది. కానీ కలెక్షన్స్‌లో అదే జోరు చూపిస్తుంది.

అలా పుష్ప 2 కేవలం 11 రోజుల్లోనే రూ.1409 కోట్ల గ్రాస్‌ చేసి ఆల్‌టైం రికార్డు కొట్టేసింది. తాజాగా పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పుష్ప 2 కలెక్షన్స్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా అతి తక్కువ టైంలో 14 వందల కోట్లు సాధించిన తొలి సినిమా పుష్ప 2 నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రిలీజైనప్పుడి నుంచి రికార్డు మీద రికార్డులు బద్దలు కొడుతూ పుష్పరాజ్‌ దండయాత్ర చేస్తున్న తీరుకు ట్రేడ్‌ పండితులే సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఈ నయా వసూళ్లతో ‘పుష్ప 2’ ఏకంగా కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల ఆల్‌టైం రికార్డ్‌ని బ్రేక్‌ చేసేంది. కేజీయఫ్‌ 2 ఆల్‌టైం రికార్డు కలెక్షన్స్‌ రూ. 1250 కోట్ల గ్రాస్‌, ఆర్‌ఆర్‌రా ఆల్‌ టైం రికార్డ్‌ కలెక్షన్స్‌ వచ్చేసి రూ. 1387 కోట్లుగా ఉన్న రికార్డుని కేవలం రెండు వారాల్లోపే పుష్ప 2 బ్రేక్‌ చేయడం విశేషం.

రూ. 2వేల కోట్ల టార్గెట్‌?

ఇక ఇప్పటికే ఎన్నో రికార్డ్స్‌ బ్రేక్‌ చేసిన ‘పుష్ప 2’ నెక్ట్స్‌ టార్గెట్‌ రూ. 2వేల కోట్లు అంటున్నారు. అదే జరిగితే ఇక బాహుబలి, దంగల్‌ సినిమాలపై ఇప్పటి వరకు ఉన్న ఆల్‌టైం రికార్డ్స్‌ని పుష్ప 2 దాటేస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఎందుకంటే కేవలం 11 రోజుల్లోనే 1400 కోట్లు సాధించింది పుష్ప 2. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఇప్పటికి పుష్ప 2 థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కనిపిస్తున్నాయి. థియేటర్ల ఆక్యూపెన్సీ కూడా దాదాపు 70 నుంచి 80 శాతం కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే మాత్రం పుష్ప 2 మూడు వారాల్లోనే బాహుబలి 2 రికార్డుని బ్రేక్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లలో బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది. రూ. 1810 కోట్లు సాధించింది ఈ సినిమా. దాన్ని బ్రేక్‌ చేయాలంటే పుష్ప 2 ఇంకా 400 కోట్లు మాత్రమే చేయాల్సి ఉంది.

ప్రస్తుతం మూవీకి ఉన్న క్రేజ్‌ చూస్తుందే అదేం పెద్ద టార్గెట్‌లా కనిపించడం లేదు. కాబట్టి ఈ వారంలో బాహుబలి రికార్డ్‌ని బ్రేక్‌ చేస్తుందని నమ్ముతున్నారు. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు మొదటి సినిమాగా ఉన్న దంగల్‌ని కూడా పుష్ప 2 దాటేసేలా కనిపిస్తోందని కూడా అంటున్నారు. ఎందుకంటే నెక్ట్స్‌ పెద్ద హీరోల సినిమాలేవి లేవు. డిసెంబర్‌ 20న అల్లరి నరేష్‌ బచ్చల మిల్లి రిలీజ్‌ ఉంది. కానీ ఇది పుష్ప కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందనే నమ్మకం లేదు. ఆ తర్వాత జనవరిలో గేమ్‌ ఛేంజర్‌ ఉంది. అప్పటి వరకు థియేటర్లలో పుష్ప 2 సందడే కొనసాగనుంది. కాబట్టి అమిర్‌ దంగల్‌ పేరుతో ఉన్న రూ. 2024 కోట్ల కలెక్షన్స్‌ని పుష్ప దాటేస్తుందని అభిమానులంతా గట్టిగా నమ్ముతున్నారు. ఇక తెలుగులో కంటే హిందీలోనే పుష్ప 2 ఎక్కువ వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు అక్కడ రూ. 561 కోట్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు చేసిన డబ్బింగ్‌ చిత్రంగా కూడా పుష్ప 2 రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే సెకండ్ వీకెండ్‌లోనూ రూ.100+ కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.