President Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు సిద్ధం!

President Biden to provide $725 million weapons aid package for Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుధ్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మొదలైన వార్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థతి కనిపించడం లేదు. అయితే తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మరిన్ని ఆయుధాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మరికొన్ని రోజుల్లో తన పదవీ కాలం ముగింపు దశలో ఉన్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అమెరికా అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కోసం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. జనవరిలో తన పదవీ విరమణ ఉన్నందున అంతకంటు ముందూ ఉక్రెయిన్‌ సైన్యాన్ని బలోపేతం చేయడానికి పూనుకున్నారు. ఈ మేరకు రష్యాతో యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ కోసం సుమారు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ స్పెషల్ ప్యాకేజీలో ప్రధానంగా యాంటీ ట్యాంక్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ మిస్సైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ కోసం అవసరమైన సామాగ్రి ఉన్నట్లు సమాచారం.

అయితే, యూఎస్ కాంగ్రెస్‌లో దీనిపై త్వరలోనే ప్యాకేజీని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, యునైటెడ్ స్టేట్స్ ఎగుమతి చేయని ఆయుధంగా ల్యాండ్ మైన్‌లను ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ అథారిటీగా పిలుస్తారు. ఈ ఆయుధాలను బైడెన్ ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. వీటిని ఎమర్జెనీ పరిస్థితుల్లో మాత్రమే మిత్ర దేశాలకు అందించేందుకు ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ అథారిటీలో నిల్వ ఉంచుతారు.