PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్నినల్ నిర్మించారు. 9 ప్లాట్ ఫామ్‌లు, 6 లిప్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మొత్తం 50 రైళ్లు నిడిచేలా 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.
అయితే ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌తో పాటు ఇతర కార్యక్రమాలను 2024 డిసెంబర్ 28న ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా, ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. మెట్రో నెట్ వర్క్ వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించినట్లు చెప్పారు.
అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక హంగులతో రైల్వే టర్మినల్‌ను రూపొందించారు. పార్కింగ్ కోసం విశాలమైన స్థలం కేటాయించారు. ప్రయాణికుల కోసం లగ్జరీ వసతులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం నాంపల్లి నుంచి బయలుదేరనున్న ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, చెన్నై ఎక్స్ ప్రెస్ చర్లపల్లి నుంచి బయలుదేరింది.