Site icon Prime9

Independence Day 2022: ఎర్రకోట పై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

New Delhi: దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రధాని మోడీ తెలిపారు. త్రివర్ణ ప్రతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా భారత్ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని ప్రధాని అన్నారు. అమృత్ మహోత్సవ్ వేళ భారతీయలందరికీ శుభాకాంక్షలు తెలిప్పారు.

అమృత్ మహోతవ్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలిని, త్యాగధనుల పోరాటా ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాట అనుపమానం మని ప్రధాని అన్నారు. గాంధీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటివారు మనకు మార్గదర్శకులన్నారు. మంగళ్ పాండ్ తో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారన్నారు. మహనీయుల తిరుగుబాట్లు మనకు స్ఫూర్తికావలని, అల్లూరి, గోవింద్ గురు వంటి వారి తిరుగుబాట్లు మనకు ఆదర్శం కావాలన్నారు.

దేశాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాల సహకారాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్వతంత్రం అనంతరం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగామన్నారు. గొప్ప దేశంగా ఎదగడానికి ఎంతో మంది శ్రమించారని ప్రధాని మోదీ కీర్తించారు.

Exit mobile version