Site icon Prime9

Abdul Rehman Makki: ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మృతి.. ఆస్పత్రిలోనే కుప్పకూలాడు!

Pakistan-Based Lashkar Terrorist Abdul Rehman Makki Dies Of Heart Attack: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయిద్ బామ్మర్ది, నిషేధిత లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం కన్నుమూశారు. లాహోర్‌లో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మధుమేహంతో బాధపడుతుండగా లాహోర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా.. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే కుప్పకూలినట్లు వైద్యులు వెల్లడించారు.

లష్కరే తోయిబా ప్రకారం.. అబ్దుల్ రెహమాన్ మక్కీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక మధుమేహం కారణంగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచినట్లు అధికారులు వెల్లడించారు.

లష్కర్ తోయిబా హఫీజ్ సయోద్ బామ్మర్ది అయిన అబ్దుల్ రెహమాన్ మక్కీపై టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు దాదాపు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో శిక్ష పడిన తర్వాత మక్కీ బయటకు ఎక్కువగా కనిపించకుండా ఉండేవాడు. ఇక, 2023లో మక్కీని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అంతేకాకుండా అతడి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ప్రయాణాలు, ఆయుధాలకు సంబంధించి నిషేధం విధించింది.

Exit mobile version
Skip to toolbar