Site icon Prime9

Oppo Find N5: ఒప్పో నుంచి బుక్ స్టైల్ ఫోన్.. సరికొత్త ప్రాసెసర్‌తో వస్తుంది.. పక్కా హిట్..!

Oppo Find N5

Oppo Find N5

Oppo Find N5: ఒప్పో తన కొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌గా Oppo Find N5ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 2023లో లాంచ్ చేసిన Oppo Find N3కి సక్సెసర్‌గా రానుంది. అయితే తాజాగా బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ Oppo Find N5కి వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం కొత్త ఫొన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రావచ్చు. ఫోన్ 2025 మొదటి త్రైమాసికంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Weibo పోస్ట్ ప్రకారం.. Oppo Find N5 2025  మొదటి త్రైమాసికం అంటే జనవరి – జూన్ మధ్య మార్కెట్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. ఇంతక ముందు లీక్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. పాత మోడల్ అంటే Oppo Find N3 అక్టోబర్ 2023లో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలైంది.

టిప్‌స్టర్ ప్రకారం.. Oppo Find N5 క్వాల్‌కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రావచ్చని తెలుస్తుంది. ఫోన్ రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది వైర్‌లెస్ మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఫోన్ “ఆపిల్ ఎకాలజీకి అనుకూలంగా” ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇది MagSafe టైప్ ఛార్జింగ్ సొల్యూషన్‌ను సూచిస్తుంది.

ఒప్పో ఫైండ్ N5 Oppo Find N3 కంటే సన్నగా, తేలికైన బిల్డ్ కలిగి ఉంటుందని అంటున్నారు. అలానే మెరుగైన మెటల్ షేప్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది దాదాపు 9.x మిమీ సన్నగా “రికార్డ్-బ్రేకింగ్” అవుతుందని గతంలో నివేదించారు. దీని ముందు మోడల్  Oppo Find N3  గ్లాస్ బ్యాక్ వెర్షన్ మందం సుమారు 11.7 మిమీ కాగా, లెదర్ వెర్షన్  మందం సుమారు 11.9 మిమీగా ఉంది.

ఒప్పో ఫైండ్ N5 2K రిజల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్  50-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుందని మునుపటి లీక్‌లు వెల్లడించాయి. వాటర్‌ప్రూఫ్ బిల్డ్‌తో పాటు, ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version