Site icon Prime9

Metro Station : ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి వృద్దురాలు ఆత్మహత్య

old women dies after jumping from erragadda metro station

old women dies after jumping from erragadda metro station

Metro Station : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మెట్రో స్టేషన్‌ లోకి ప్రవేశించిన మహిళ ఆ తర్వాత పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్రగాయాలవ్వగా… అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధురాలిని  మారెమ్మగా గుర్తించారు.

మృతురాలు మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మారెమ్మ వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు అని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే మారెమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఈ మేరకు మారెమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు… ఆత్మహత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Exit mobile version