Site icon Prime9

Unstoppable Season 4: ఎన్‌బీకే అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 – ఏపీ సీఎం చంద్రబాబుతో సూపర్‌ స్పెషల్‌ ఎపిసోడ్

Balayya Unstappable Season 4

NBK Unstapable Season 4 Update: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టారు. మరోవైపు వెండితెరపై హీరోగానూ వరుస హిట్స్‌ కొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన హోస్ట్‌గానూ డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అన్‌స్టాపబుల్‌ అనే టాక్‌ షోతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తనదైన వాక్చాతుర్యంతో ఈ షో దేశంలోనే నెం వన్‌గా నిలబెట్టారు. ఇప్పటి వరకు ఈ సో మూడు సీజన్స్‌ పూర్తి చేసుకుని నాలుగో సీజన్‌కు రెడీ అయ్యింది. రేపు అక్టోబర్‌ 20న అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో ఫస్ట్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరగబోతున్నట్టు సమాచారం.

అయితే ఈ సీజన్‌ తొలి ఎపిసోడ్‌ను ఆహా టీం చాలా గ్రాండ్‌ ప్లాన్‌ చేసింది. ఫస్ట్‌ ఎపిసోడ్‌కు సెలబ్రిటీ గెస్ట్ ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఏప సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పెషల్‌ గెస్ట్‌గా సూపర్‌ స్పెషల్ ఎపిసోడ్‌గా ప్లాన్‌ చేసి ఆడియన్స్కు ట్రీట్ ఫీస్ట్‌ ఇవ్వబోతోంది ఆహా టీం. ఇందుకు సంబంధించి అప్‌డేట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా గతంలోనూ చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పుడు మాజీ సీఎం, ప్రతిపక్ష హోదాలో ఈ షోకు హాజరైన ఆయన ఇప్పుడు సీఎంగా అన్‌స్టాపబుల్‌లో సందడి చేయబోతున్నారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే గత సీజన్‌లో చంద్రబాబు నాయుడు, ఆయన అల్లుడు నారా లోకేష్‌లు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌ బాలయ్య తనదైన చిలిపి ప్రశ్నలతో తన బావను ఆటాడుకున్నారు. కానీ తనదైన స్టైల్లో చంద్రబాబు నాయుడు మాధానాలు ఇచ్చి బాలయ్యను తికమక పెట్టారు. అలా ఎంతో సరదాగ సాగిన ఈ ఎపిసోడ్‌ బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. ఈ ఒక్క ఎపిసోడ్‌ మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో త్వరలో ప్రసారం కాబోయే బాలయ్య-చంద్రబాబు ఎపిసోడ్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే గారి హోస్టింగ్‌లో స్పెషల్‌ గెస్ట్‌ సీఎం గారు అంటూ నెట్టింట హడావుడి చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్‌. దీంతో ఈ ఎపిసోడ్‌ ఆసక్తిని సంతరించుకుంది. ఈ టాక్‌ షోలో అధికారంలో ఉన్న ఈ బావబామ్మర్దిల సందడి, హంగామా ఎలా ఉండబోతుందో చూసేందుకు ఆడియన్స్‌ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సూపర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ ఏ స్థాయిలో ఫ్యాన్స్‌ అలరిస్తుందో చూడాలి.

Exit mobile version