Site icon Prime9

Naga Chaitanya: నిశ్చితార్థం తర్వాత ఫస్ట్‌టైం శోభితతో నాగచైతన్య – ఫోటో షేర్‌ చేసిన చై

Naga Chaitanya-Sobhita Dhulipala

Naga Chaitanya and Sobhita Dhulipala Photo Viral: అక్కినేని హీరో, యువ సామ్రాట్‌ నాగచైతన్య నటి శోభిత ధూళిపాళను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు తమ రిలేషన్‌పై ఈ లవ్‌బర్ట్స్‌ పెదవి విప్పలేదు. కానీ సడెన్‌ నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. కేవలం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఆగష్టులో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అనంతరం ఫోటోలు షేర్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇక అప్పటి నుంచి చై-శోభిత తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజులు అయితే సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే చర్చ. సమంతతో విడాకులు విషయంలో కొందరు చైని ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. సమంతతో విడాకులు కారణం ఇదేనా? ఇంతకాలం మంచివాడిగా భలే నడించావంటూ విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు జంటగా కనిపించింది లేదు. పబలిక్‌గా సింగిల్‌గా కనిపిస్తున్నారు. వారి వారి పనులతో ఇద్దరు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య కాబోయే భార్యతో ఫోటో షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. పర్సనల్‌ లైఫ్‌ని సోషల్‌ మీడియా, మీడియాకు దూరంగా ఉంచే చై తొలిసారి తన ఫియాన్సీతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేశాడు. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వీరిద్దరు కలిసి కనిపించడం కూడా ఇదే మొదటిసారి. ఇక సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే చై ఫస్ట్‌టైం శోభితతో డేట్‌కి వెళ్లిన పిక్‌ షేర్‌ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇందులో వీరిద్దరు బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. “ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌” అంటూ క్యాప్షన్‌ ఇచ్చాయి. ఈ పోస్ట్‌కి కామెంట్‌ సెక్షన్‌ని మాత్రం ఆఫ్‌ చేయడం గమనార్హం.

Exit mobile version