Mukarram Jah: చివరి నిజాం రాజు.. ముఖరంజా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి చివరి నిజాం మరణించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
చివిరి నిజాం Nizam Family మృతదేహాన్ని మంగళవారం ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. సాయంత్రం మక్కా మసీదులో ప్రార్థన అనంతరం.. ఆయన తండ్రి అజమ్‌ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఉస్మాన్ అలీఖాన్ పెద్దకుమారుడైన అజమ్ కు ముఖరంజా 1933లో జన్మించారు.
ఇతడిని అందరు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.
చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు ఉన్నా.. ముఖరంజాను 8వ నిజాంగా ప్రకటించారు.
అయితే 1971లో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసింది.
దీంతో చివరి నిజాం రాజాభరణం రద్దైంది. చివరి నిజాంకు నలుగురు భార్యలు ఉన్నారు.
ప్రపంచలోనే కుబేరుడిగా ఉస్మాన్ అలీఖాన్ అప్పట్లో గుర్తింపు పొందారు.
ఆయన వారసుడిగా వచ్చిన ముఖరంజా కూడా కుబేరుడయ్యారు.
కానీ విలాసాలకు అలవాటు పడి.. దివాలా తీశారు.
కుటుంబ విభేదాలు.. ఆస్తి వివాదాలతో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో నిజాం వారసులు సైతం కోర్టుకెక్కారు.
ఇక్కడి ఆస్తులను అమ్మడానికి వీల్లేదని.. కోర్టు ఆంక్షలు విధించింది. చివరికి ఇస్తాంబుల్‌లోని ఓ డబుల్ బెడ్‌రూమ్ కే చివరి నిజాం పరిమితమయ్యారు.
చివరి నిజాం మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిజాం చేసిన సామాజిక సేవలకు గుర్తుగా అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ని ఆదేశించారు.
అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చూడాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌కు సీఎం సూచించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/