Site icon Prime9

Nizam Family: ఎనిమిదో నిజాం మృతి.. హైదరాబాద్ లో అంత్యక్రియలు

Nizam family

Nizam family

Nizam Family: హైదరాబాద్ సంస్థానాన్ని ఏళ్లపాటు నిజాం వంశస్థులు  పాలించిన విషయం తెలిసిందే. ఇక నిజాం వంశంలో ఎనిమిదవ నిజాం ముఖరం ఝా బహదూర్ తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణాన్ని హైదరాబాద్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. శనివారం రాత్రి మరణించినట్లు తెలిపింది. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయనున్నట్లు నిజాం
కుటుంబం ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది.

ఎనిమిదవ నిజాం (Nizam Family) వయసు 89 సంవత్సరాలు.. కాగా అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందారు. ఎనిమిదవ నిజాం హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు ఆయన మనవడు. ఆయన అలీ ఖాన్కు వారసుడిగా ప్రస్తుతం ఉన్నారు. ముఖరం ఝాఅసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్. మీర్ హిమాయత్ అలీ ఖాన్ కుమారుడైన ముఖరం ఝా 1933 అక్టోబరు 6న జన్మించారు. ఆయన తల్లి డుర్రు షెవర్.. టర్కీ చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె. ఈయన తల్లి 20 ఏళ్ల క్రితమే మరణించారు.

స్వాతంత్య్రం అనంతరం  నిజాం రాజు  దేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడ్డారు.

ఎనిమిదో నిజాం టర్కీలోని ఇస్తాంబుల్ లో నివాసం ఉంటున్నారు.

నిజాం చివరి కోరిక మేరకు జనవరి 17న హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చౌమహల్లా ప్యాలెస్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతరం.. అసఫ్ జాహీ కుటుంబ సమాధి వద్ద ఖననం చేస్తారు.

దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

హైదరాబాద్ ను పాలించిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. తన తరువాతి వారసుడిగా ముఖరం ఝా ని ప్ర‌క‌టించారు. అప్పటినుంచి ముకర్రం జా 8వ న‌వాబుగా ప్రసిద్ధి చెందారు.

1971 వ‌ర‌కు ముఖరం ఝా ప్రిన్స్ ఆఫ్ హైద‌రాబాద్ గా పిలవబడుతూ వచ్చారు.

1971లో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ప‌ద‌వులు, బిరుదులు ర‌ద్ద‌య్యాయి.

ముఖరం ఝా అస‌లు పేరు బ‌ర్క‌త్ అలీ ఖాన్.

టర్కీలోని ఇస్తాంబుల్‌ లో మృతి చెందిన ముఖరం ఝా బహదూర్.

శనివారం రాత్రి తుది శ్వాస విడిచినట్టు హైదరాబాద్ లోని కార్యాలయం ప్రకటన.

ఆయన కోరిక మేరకు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version