Site icon Prime9

MP Guru Murthy: దక్షిణ భారత దేశంలో పార్లమెంటు సమావేశాలు.. దేశానికీ రెండో రాజధానిపై డిమాండ్!

MP Gurumurthy Letter To PM Modi: దేశ రాజధానిలో నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుండడం, మరో వైపు శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తెరపైకి కొత్త డిమాండ్ వస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో రెండు సమావేశాలైన దక్షిణ భారత దేశంలో నిర్వహించాలని తిరుపతి ఎంపీ డిమాండ్ చేయడం ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే దేశానికీ రెండో రాజధానిపై అనేక డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలనే డిమాండ్ తెరపైకి రావడంతో సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

కాగా, పురాణ, ఇతిహాసాల కాలం నుంచి ఢిల్లీకి ఎంతో ప్రాశస్త్యం ,ప్రాధానత్య వుంది. హస్తినాపురంగా ,ఇంద్రప్రస్థ గా ఢిల్లీ గతం నుంచి ఘనకీర్తి కలిగి వున్న నగరం హర్షుడు, సుల్తానులు, మొగలాయలు ఇలా ఎంతో మంది ఢిల్లీ కేంద్రంగా భారతావనిని పరిపాలించిన వారే. బ్రిటిష్ వాళ్ళు సైతం దేశ రాజధానిని కొలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన పరిస్థితి వచ్చింది. అంతటి కీలమైన ప్రాముఖ్యమైన ప్రాంతం ఢిల్లీ .స్వాతంత్య్రానికి పూర్వం తర్వాత కూడా ఢిల్లీ కి ఎనలేని ప్రాధాన్యత చేకూరింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీనే దేశ రాజధానిగా కొనసాగించారు. సుల్తానులు, మొగలలు నిర్మించిన కట్టడాలు రాజధానిగా కొనసాగడానికి వీలు కల్పించాయి. క్రమేణా జనాభా పెరగడంతో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి కేంద్ర పాలిత ప్రాంతగానే కొనసాగిస్తున్నారు. దక్షిణ భారత దేశానికీ చాలా దూరంగా వున్న రాజధాని ఢిల్లీ పై దక్షిణాది నేతలు అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల ఢిల్లీ లో వాయు కాలుష్యం ఎక్కువఅవ్వడంతో పార్లమెంట్ సమావేవాలు దక్షిణాన జరపాలని డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరుకు దేశానికీ ఢిల్లీ తరువాత రెండో రాజధాని ని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ లు వున్నాయి .ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ మావేశాలు జరపాలని డిమాండ్ వస్తోంది .

ఇక, ఢిల్లీలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో శీతాకాలం పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు హాజరుకావడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఇటీవల వాయు కాలుష్యం కూడా చలికి తోడైంది. దీంతో దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ కి తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. కనీసం ఏడాదికి రెండు సెషన్స్ అయినా దక్షిణ భారత దేశంలో నిర్వహించాలని ఆ లేఖలో ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ సమగ్రత దృష్ట్యా దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇదే విషయాన్ని ‘భాషా పాలిత రాష్ట్రాలు’ అనే పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం ప్రస్తావించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై విశాల దృక్పధంతో ఉండాలని మాజీ ప్రధాని వాజ్ పేయ్ సైతం చెప్పారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా దక్షిణ భారత్‌ దేశంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో గుర్తు మూర్తి కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .

గతంలోనే దేశానికీ రెండో రాజధానిగా హైదరాబాద్ పేరు తెరపైకి వచ్చింది .హైదరాబాద్ మహానగరంలో రక్షణ శాఖకు చెందిన చాలా సంస్థలు వున్నాయి .దింతో దేశరక్షణ పరంగా హైదరాబాద్ చాలా కీలకంగా మారింది .ఈ నేపథ్యంలో దేశానికీ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలనీ పలువురు డిమాండ్ చేసారు .ఇప్పటికి ఇలాంటి డిమాండ్లు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి .రక్షణ పరంగా ఢిల్లీ పాకిస్థాన్ ,చైనాలకు టార్గెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి .దింతో ప్రత్యామ్నాయం గా రెండో రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేసుకోవాలని మేధావులు సైతం చెబుతూ వస్తున్నారు.ఈ క్రమంలోహైదరాబాద్ పేరు తెరపైకి వచ్చింది .దీనిపై ఇప్పటికి మేధావుల్లో చర్చలు జరుగుతున్నాయి .రెండో రాజధానికి కావాల్సిన అర్హతలు అన్ని హైదరాబాద్ కు ఉన్నాయని నిపుణులు కూడా అంటున్నారు .పైగా రాష్ట్రపతి శీతాకాల విడిది హైదరాబాద్ లోనే వుంది .ఢిల్లీ వెలుపల రాష్ట్రపతి నిలయం వున్న ఏకైక ప్రాంతం హైదరాబాదే కావడం విశేషం .దేశంలో పెద్ద కంటోన్మెంట్ లలో ఒకటి హైదరాబాద్ లోనే వుంది .ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌‌‌‌ లేదా సికింద్రాబాద్‌‌‌‌ను రెండో రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే వచ్చింది.

దేశానికీ రెండో రాజధాని కూడా ఉంటే బాగుంటుందనేది దేశ ప్రధమ ప్రధాని జవహర్‌‌‌‌ లాల్‌‌‌‌ నెహ్రూ ఆనాడే అనుకున్నారని సమాచారం. హైదరాబాద్ రాష్ట్రంలో సైనిక చర్య అనంతరం దేశానికి రెండో రాజధాని అవసరాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ స్టేట్‌‌‌‌లోని సికింద్రాబాద్‌‌‌‌ ను దీనికి సంబందించి నాటి కేంద్ర మంత్రి విఎన్ గాడ్గిల్ పరిశీలన జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చినట్లు చెబుతున్నారు . నాసిక్‌‌‌‌ కంటె సికింద్రాబాద్‌‌‌‌ అనువైన ప్రదేశమని గాడ్గిల్‌‌‌‌ కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు ఆధారాలు చూపుతున్నారు కొంతమంది . ఆ తర్వాత పట్టించుకునే వారు లేనందున ఈ అంశం మూలకు పడింది. 1950 లో అంబేద్కర్‌‌‌‌ రెండో రాజధాని అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు. అందుకు హైదరాబాద్‌‌‌‌ అయితేనే బాగుంటుందని కూడా సూచించారు. హైదరాబాద్‌‌‌‌ ను రెండో రాజధానిగా చేస్తే ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయని అంబేద్కర్‌‌‌‌ ప్రస్తావించారు.

మరో వైపు 2013లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రాష్ట్ర విభజన సమయంలో కూడా హైదరాబాద్‌‌‌‌ను రెండో రాజధానిగా చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రా ప్రాంతం నుంచి డిమాండ్లు వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే సహించే ప్రసక్తిలేదని తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రంలో నాటి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కనబెట్టింది.తాజాగా వైసిపి ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ సమావేశాలు అయినా నిర్వహించాలని కోరడంతో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

Exit mobile version