Site icon Prime9

Mla Avanthi Srinivas : పబ్లిక్ గా మంత్రి అవంతి శ్రీనివాస్ కి షాక్ ఇచ్చిన మహిళ… ముందే ట్రైనింగ్ ఇవ్వరా అంటూ !

mla-avanthi-srinivas-shocked with ddwakra women answer about chandrababu

mla-avanthi-srinivas-shocked with ddwakra women answer about chandrababu

Mla Avanthi Srinivas : వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా భీమిలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ కు ఓ డ్వాక్రా మహిళ పబ్లిక్ గా ఊహించని ఆన్సర్ ఇచ్చి ఖంగు తినిపించింది. దీంతో ఎం చేయాలో తెలియక అధికారులపై తన కోపాన్ని చూపించారు అవంతి. ఈ ఘటన విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం మద్ది గ్రామంలో చోటు చేసుకుంది.

మద్ది గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన సామాజిక భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భవనాల ఏర్పాటు గురించి అవంతి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో చంద్రబాబు సున్నా వడ్డీ పథకం అమలు చేశారా అని ఓ డ్వాక్రా మహిళను ప్రశ్నించారు. దీంతో ఆమె వెంటనే చేశారంటూ సమాధానమిచ్చింది. దీంతో అవంతి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక పక్కనే ఉన్న అధికారులు ఎమ్మెల్యే ముందు అలా చెప్పకూడదంటూ ఆమెకు సర్దిచెప్పారు.

ఇక మహిళ సమాధానంతో ఖంగుతిన్న అవంతి శ్రీనివాస్ సభకు తీసుకొచ్చే ముందు మహిళలకు శిక్షణ ఇవ్వరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అవంతి శ్రీనివాస్ కు సంబంధించి ఓ ఫెక్ ఆడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఘటనపై అవంతిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక ఇప్పుడు అనుకోని ఆన్సర్ తో షాక్ తిన్న అవంతి శ్రీనివాస్ అంటూ ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Exit mobile version