Site icon Prime9

Padayatra farmers: మంత్రి బొత్స మాటలు సరికాదు..పాదయాత్ర రైతులు

Minister Botsa's words are not correct

Minister Botsa's words are not correct

Farmers Padayatra: అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కొరకు నాడు భూములు లిచ్చిన రైతులు, రైతు కూలీలు రాజధానిగా ఎందుకు అమరావతినే కోరుకుంటున్నామో తెలుపుతూ పాదయాత్రలో తమ పాత్రను పోషిస్తున్నారు. ఏపికి ఏకైక రాజధాని అమరావతిగా ఉండేందుకు తలపెట్టిన మహాపాదయాత్ర 15రోజుకు చేరుకొనింది. నిన్నటిదినం విశాఖలో మంత్రి బొత్స మాటలపై పాదయాత్ర రైతులు అభ్యంతరం వ్యక్తం చేసారు. 5 నిమిషాలు పట్టదు అనే మాట కరెక్ట్ కాదన్నారు.

కృష్ణా నుండి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల మహా పాదయాత్ర సోమవారం దెందలూరు నియోజకవర్గం కొనికి నుండి ఉత్సాహంగా ప్రారంభమైంది. రైతులకు సంఘీభావం తెలిపేందుకు తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, శాసనసభ్యులు నిమ్మల రామా నాయుడు, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎంపీ మాగంటి బాబులతో పాటు పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొని రైతులకు భరోసా కల్పించారు. డప్పు వాయించి అక్కడి వారందర్ని ఉత్సాహ పరిచారు. వీరితో పాటు జనసేన, వామపక్ష నేతలు కూడా జత కలిసి పాదయాత్రకు తమ మద్దతును తెలిపారు.

నేడు 15కి.మీ సాగనున్న పాదయాత్ర కడిమికుంట, సకల కొత్తపల్లి, సత్యవోలు, నాయుడగూడెం, పెదపాడు, సత్యనారాయణ పురం, అందేఖాన్ చెరువు మీదుగా కొత్తూరుకు చేరుకోనుంది. పెదపాడులో భోజన కార్యక్రమాలు, రాత్రికి వట్లూరు క్రాంతి కల్యాణ మండపంలో రైతులు బస చేయనున్నట్లు అమరావతి జేఏసి నేతలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న రైతులు, రైతు కూలీలు, అమరావతి పరిసర ప్రాంత వాసులు మాట్లాడుతూ రాజధానిగా అమరావతి కొనసాగించేందుకు చావుకైనా రెడీ అంటున్నారు. సెంటు భూమి కూడా లేని రైతు కూలీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వారి ఉద్ధేశం కేవలం రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే ప్రతివక్కరికి పని కలుగుతుందని, ఆసరాకు ఎంతో ఉపయోగంగా ఉండడమే కారణంగా పేర్కొంటున్నారు.

పాదయాత్రను చేపడుతుంది, ఏ జగన్ కోసమే, దేన్నో ఆశించో పాదయాత్ర చేయడం లేదంటున్నారు. గుడివాడలో వాతావరణం ఎంత భయానకంగా ఉందో అందరూ చూసారన్నారు. ప్రభుత్వ రహదారులపై ఎవరైనా, ఎక్కడికైనా పోవచ్చన్నారు. వ్యక్తిగతంగా మేము ఎవ్వరిపైకి దాడులకు దిగలేదన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడం సరికాదన్నారు. హక్కును తెలుపుకొనే స్వాతంత్ర్యం కూడా లేదా అన్ని ప్రశ్నిస్తున్నారు.

మంత్రి బొత్స గారికి సంబంధించిన పొలాన్ని ఇలానే ఏదైనా వదులుకొంటారా అన్ని ప్రశ్నించారు. విలువైన భూముల్ని వదులుకొన్న అమరావతి రైతుల దుస్థితి నేడు దయనీయంగా మారిందన్నారు. మరో రైతు 6 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన్నట్లుగా చెప్పుకొచ్చారు. నేడు మా పరిస్ధితి పూర్తిగా దిగజారిందన్నారు. పిల్లల చదువులకు సైతం ఇబ్బందులు పడుతున్నామని లబోదిబోమన్నారు. తాతల కాలం నాటి పొలాలను రాజధాని కోసం ఇచ్చామన్నారు. 6కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చామని భోరుమన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించడంతోపాటు వాస్తవాలను ప్రజలకు తెలియచేయడమే పాదయాత్ర ఉద్ధేశంగా తెలిపారు.

ఇది కూడా చదవండి

Tehsildar Venkatesh : ఏసీబీ వలలో దామరగిద్ద తహశీల్దారు వెంకటేష్

Exit mobile version