Site icon Prime9

Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం.. జీబీఎస్‌తో వ్యక్తి మృతి.. లక్షణాలు ఇవే!

Maharashtra Reports 1st Death Due To Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కారణంగా సోలాసూర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ప్రధానంగా జీబీఎస్ కారణమని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూణేలో ఈ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 101 వరకు పెరిగాయి. ఇందులో 16మందిని వెంటిలేటర్‌పై ఉంచి మెరుగైన చికిత్స పొందుతుండగా.. మిగతా వాళ్ల పరిస్థితి సాధారణంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. దీని కారణంగా చనిపోయిన వ్యక్తి ఫూణె ప్రాంతానికి చెందిన వాడని సమాచారం. మృతుడు కూడా ఫూణె ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు.

ప్రధానంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ జీబీఎస్ సంక్రమించే అవకాశం ఉంది. నరాలపై దాడి చేయవచ్చని.. దీనికి బారీన పడితే శరీరమంతా తిమ్మిరి అనిపించడం, కండరాలు క్షీణత లక్షణాలు ఉంటాయని వైద్య వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఈ వ్యాధి బారిన పడితే డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు కూడా కలగవచ్చు

Exit mobile version
Skip to toolbar