Site icon Prime9

Mahanadu 2023 : అట్టహాసంగా ప్రారంభమైన “మహానాడు – 2023”.. భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ళు

latest news on telugu desam party mahanadu 2023

latest news on telugu desam party mahanadu 2023

Mahanadu 2023 : రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “మహానాడు – 2023 ” కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ. రామారావు శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈ సారి మహానాడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది టీడీపీ నాయకత్వం.

రెండ్రోజుల పాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మహానాడును 38 ఎకరాల విశాలమైన గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వరకు దీనికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను కూడా ఇక్కడే ముగించనున్నారు.

కార్యక్రమానికి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. తొలి రోజున ప్రతినిధుల సభకు 30 నుంచి 40 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మందికి రుచికరమైన, నోరూరించే ఆంధ్ర వంటకాలను సిద్ధం చేస్తున్నారు. విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ కు చెందిన కిలారు వెంకట శివాజీకి వంట బాధ్యతలను అప్పగించారు. 1,500 మంది వంటవాళ్లు 200 వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేశారు. ఆదివారం నాడు భారీ బహిరంగసభకు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

ఈరోజు (శనివారం) మెనూ:
టిఫిన్ – ఇడ్లీ, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు, పొంగల్, టమోటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్.

మధ్యాహ్నం, రాత్రి భోజనాలు – వెజ్ బిర్యానీ, బంగాళాదుంప కుర్మా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బెండకాయ వేరుశనగ, గుత్తి వంకాయ, బెండకాయ ఫ్రై, టమోటా మునక్కాడ, మామిడి కాయ పప్పు, దొండకాయ ఫ్రై, మామిడి ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు, కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ.

రేపు (శనివారం) మెనూ:
టిఫిన్ – ఇడ్లీ, మైసూర్ బజ్జీ, వడ, పునుగులు, పొంగల్, టమోటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్.

మధ్యాహ్నం, రాత్రి – శుక్రవారం నాటి వంటకాలే ఉంటాయి. అయితే స్వల్ప మార్పులు ఉంటాయి. సాంబార్ రైస్, చక్కర పొంగలి, పెరుగన్నం అదనంగా ఉంటాయి.

భోజనాల వద్ద 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

 

Exit mobile version
Skip to toolbar