Site icon Prime9

KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్.. మీడియాతో సంచలన వ్యాఖ్యలు

KTR sentaional comments before interrogation: తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికే ఈ-రేస్ నిర్వహించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను కేసీఆర్ సైనికుడిని అని వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి ప్రయత్నించామని వెల్లడించారు. నేను క్విడ్ ప్రోకోకి పాల్పడలేదని, ఆ తెలివితేటలు వాళ్లకే ఉన్నాయని చెప్పారు. నేను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ఠ కోసమే చేశానని వెల్లడించారు.

తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి మీలా దొరికిపోయిన దొంగను కాదని వివరించారు. నేను అరపైసా అవినీతి కూడా చేయలేదన్నారు. అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు.  మీలా బావమరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు మేం కట్టబెట్టలేదన్నారు.

నిజం అనేది నిలకడ మీద తెలుస్తుందని, 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉందని వెల్లడించారు. మేం నిజాయితీగా ఉంటామని, మీలా నీచపు పనులు చేయలేదని ఆరోపణలు చేశారు. అవసరమైతే చస్తా తప్పా.. లుచ్చా పనులు చేయనని కేటీఆర్ వెల్లడించారు.

అనంతరం ఏసీబీ విచారణకు కేటీఆర్ బయలుదేరారు. నందినగర్ నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఇదిలా ఉండగా, కేటీఆర్‌ను ముగ్గురు అధికారుల బృందం విచారించనున్నారు. విచారణను ఏసీబీ డైరెక్టర్ జోషి పర్యవేక్షించనున్నారు.

 

Exit mobile version