International Womens Day : మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్‌ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 09:46 AM IST

International Womens Day : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్స్‌ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రికేయులను సత్కరించారు. చైతన్య గంగినేని, పాలడుగు పద్మజ, గొర్లె శ్రీసత్యవాణి, దాయన పద్మశ్రీ, తుమ్మల నాగిని, నీరుకొండ అనూష, చెరుకూరి శాంతిశ్రీ(ఈనాడు), ఎం. స్వప్నప్రియ, ఎంకేడీ రాణి, షహీన్ (ఈటీవీ తెలంగాణ) లతో పాటు 137 మంది మహిళా జర్నలిస్టులు సత్కారం అందుకున్నారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మహిళా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరఫున సత్కారం, గుర్తింపు పొందుతున్నందుకు శుభాకాంక్షలు అన్నారు. ‘లేడి ఫొటోగ్రాఫర్లు, జర్నలిస్టులను చూస్తుంటే అప్పుడప్పు బాధ అనిపిస్తుంటుంది. హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. త్వరలో వీహబ్ ద్వారా రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 19 వేల మంది పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చామని, గుజరాత్లో మూడు వేల కార్డులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎంత మంచిచేసినా దానికి తగిన ప్రాధాన్యం ఉండడం లేదని, చిన్న తప్పు జరిగితే ఎక్కువగా చూపుతున్నా రని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం కళ్లు మూసుకుందనే కోణంలో నిందించడం సరికాదని, యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోందని చెప్పారు. మహిళా జర్నలిస్టులంతా ఏకమై మహిళా జర్నలిస్ట్‌ యూనియన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మహిళా జర్నలిస్టుల కోసం యాక్సిలేటర్‌ ప్రోగ్రామ్‌..

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వీ హబ్‌ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం ‘విమెన్‌ ఇన్‌ జర్నలిజం లీడర్‌షిప్‌ యాక్సిలరేటర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతున్నాం. ఎవరైనా ఔత్సాహికులు ఎవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో.. మెరుగ్గా, సమర్థవంతంగా, కొత్త కొత్త పోకడలు, కొత్త వినూత్న ఆలోచనలను అర్థవంతంగా నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరుతెచ్చుకోవాలనుకునే వారి కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నాం. వీ హబ్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నది. ఐ అండ్‌ పీఆర్‌ కమిషన్‌ అరవింద్‌కుమార్‌ కు ధన్యవాదాలు. గత సంవత్సరం కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు సంవత్సరం కార్యక్రమం నిర్వహించకోవాలనుకున్నా కొవిడ్‌తో జరుపలేకపోయాం’ అన్నారు.

ఆ విషయంలో కేటీఆర్ విజ్ఞప్తి..

‘జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి. గవర్నమెంట్‌, ప్రజాప్రతినిధులు అందరూ కోరుకునేది ఏంటంటే.. మేం ఏదైనా తప్పు, పొరపాటు చేసినప్పుడు, ప్రజా వ్యతిరేక పనులు చేసిన సమయంలో చీల్చిచెండాడే హక్కు మీకు ఉంటుంది. మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌. అదే సమయంలో మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కను మనిషి కరిస్తే కూడా వార్త కాదు. ‘మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగిన సమయంలో మనిషన్న వారెవరూ బాధపడకుండా ఉండరు. కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకి ఆ సెన్సివిటీ లేదనుకోవద్దు. ఇలాంటి వాటిలో రాత్రికి రాత్రే మార్పులు రావు. మహిళలను గౌరవించాలి, సాటి అమ్మాయిని గౌరవించాలనే సంస్కృతిని చిన్ననాటి నుంచే మగ పిల్లలకు నేర్పించాలి. జెండర్ సెన్సివిటి కరిక్యులమ్‌లో ఉండాలని, దానికి ప్రయత్నాలు జరగాలని పేర్కొన్నారు. ఒక ప్రయత్నం జరిగితే.. తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఇందుకు సామాజిక బాధ్యతగా జర్నలిస్టులు ప్రచారం చేయాలి. జెండర్‌ సెన్సివిటీ, మహిళలపై దాడులు దాడులను నివారించేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై ఎంత అవగాహన కల్పిస్తే అంత మంచిది.  సీనియర్‌ జర్నలిస్టులు వీ హబ్‌లో భాగస్వాములు కావాలి. సీనియర్‌ మహిళా జర్నలిస్టులు తమ అనుభవాలు, ఆలోచనలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైనా సవాళ్లను కొత్త తరం జర్నలిస్టులతో పని చేసేందుకు వీ హబ్‌తో పని చేయాలి. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తాం.

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలకు జర్నలిజం వృత్తి కత్తిమీద సాములాంటిదన్నారు. అలానే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్ల పుట్టగానే గుండెల మీద కుంపటిగా భావించే రోజులు పోయాయని, ప్రస్తుతం లక్ష్మీదేవిగా కొలుస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, సమాచార శాఖ కమిషనర్, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ , సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి తదిత రులు పాల్గొన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/