Site icon Prime9

Komatireddy: క్రాస్ రోడ్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy in rtc Cross Roads

Komatireddy Venkat Reddy

Komatireddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌ తెలంగాణలో ఒక్కసారిగా న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడులో ఆయన నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం – అంటీ ముట్టనట్లు ఉండటమేగాకుండా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిపైనే ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రుచించడం లేదు. వెంకట్‌రెడ్డి కావాలనే అలా చేస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్‌ అధిష్టానం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని లైట్‌ తీస్కోండి అని తెలంగాణ నేతలకు చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. మొన్నటి వరకు రాజగోపాల రెడ్డి విషయంలో తీవ్చ చర్చ కొనసాగింది. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తన సోదరుడిలాగా పార్టీకి రాజీనామా చేయకపోయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో హైకమాండ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈమేరకు కోమటిరెడ్డి గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని రాష్ట్ర నాయకులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.కొన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీలో ఉంటూనే పీసీసీ చీఫ్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సోదరుడితో కలిసి ఆయన అమిత్ షాను కలవడంతో ఆయన ఇక బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు. అటు వెంకట్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాకర్ కూడా సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే వీరి క్షమాపణలతో వెంకటరెడ్డి సంతృప్తి చెందలేదు. ట్విట్టర్ ద్వారా మళ్లీ ఈ విషయాన్ని రేజ్ చేశారు. దీంతో ఈ విషయం అధిష్టానం వద్దకు చేరింది. కోమటిరెడ్డి వ్యవహరంపై అధిష్టానం సీరియస్ అయింది. ఇక అయన గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని చెప్పింది. కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పరిగణలోకి తీసుకోవద్దని తెలిపినట్లు హస్తిన నుంచి వార్తలు వస్తున్నాయి.రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉప ఎన్నిక వ్యవహారంలో వెంకటరెడ్డి ఎలాంటి చొరవ చూపడం లేదు. కనీసం పార్టీ నిర్వహించే సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే కోమటిరెడ్డి అనుచరులు మాత్రం ఆయనను ఫాలో కావడం లేదు. దీంతో కోమటిరెడ్డిని పట్టించుకోకుండా ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. మునుగుడో నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి రాజీనామాను మెజార్టీ నేతలు హర్షించడం లేదు. పైగా మోసం చేశారని కొందరు పోస్టర్లు కూడా అంటించారు.

కానీ సోదరుడి వ్యవహారంపై ఏమీ మాట్లాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర విషయాలను పెద్దదిగా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో.. కాంగ్రెస్ లో కొనసాగుతూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఆయనను ఇక లైట్ గా తీసుకోవాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని ఆయన అనుచరులు – పార్టీ నిర్వహించే సమావేశానికి వెళ్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ పని అయిపోయినట్లేనని కాంగ్రెస్‌లో చర్చించుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar