Komatireddy Venkat Reddy Reaction on allu arjun statements: సినీ నటుడు అల్లు అర్జున్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. తన ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేదన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అలా ఎదురుదాడిగా దిగడం ఏంటని ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించకపోవడంపై అల్లు అర్జున్ చెప్పిన మాటలు చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో లీగల్ టీం ఒప్పుకోలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందన్నారు. అయితే ఇక నుంచి మేము బెనిఫిట్ షాలు అనుమతి ఇవ్వమని కోమటిరెడ్డి చెప్పారు.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు ఎవరినీ కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టకూడదని సూచించాడు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అలాగే కొంతమంది గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలి అభిమానులకు అల్లు అర్జున్ సూచించాడు.