Site icon Prime9

OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న లేటెస్ట్‌ హిట్‌ మూవీ ‘సత్యం సుందరం – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Sathyam Sundaram OTT Release

Sathyam Sundaram Movie OTT Release Date: హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ హీరో అయిన అతడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ముఖ్యంగా అతడి సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్‌ ఉంది. యూత్‌ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌ సైతం కార్తీ సినిమాలకు అభిమానులు. అలా అతడు నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ డబ్‌ అవుతుంది. అలా తమిళ్, తెలుగులో కార్తీ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే కార్తీ సినిమాలకు ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యంతో పాటు లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. అయితే ఈ మధ్య కార్తీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

గతేడాది జపాన్‌ చిత్రంతో వచ్చిన కార్తీ రీసెంట్‌గా ‘సత్యం సుందరం’ అంటూ ఎమోషనల్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌, తెలుగులో విడుదలైన ఈ సినిమాపై మొదట ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కారణం ఎన్టీఆర్‌ దేవర చిత్రంతో కలిసి సత్యం సుందరం థియేటర్లోకి వచ్చింది. దాంతో ఆడియన్స్‌ అంతా సత్యం సుందరం మూవీ ఏం చూస్తాంలే అనుకున్నారు. కానీ థియేట్రికల్‌ రన్‌లో ఈ సినిమా హిట్‌ టాక్‌ ెచ్చుకుంది. కార్తీ, అరవింద్‌ స్వామి లీడ్‌ రోల్లో వచ్చిన ఈ సినిమాకు 96 ఫేం సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీ అన్నయ్య, హీరో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న థియేటర్లోకి విడుదలైంది. తమిళంలో మైయళగన్‌ పేరుతో విడుదల కాగా, తెలుగులో సత్యం సుందరం పేరు రిలీజ్‌ అయ్యింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు.

ఇందులో కార్తీ, అరవింద్‌ స్వామిలీలు బావ-బావమరుదులుగా నటించారు. కుటుంబ విలువలు, బంధాల విలువను తెలియజేస్తూ వీరిద్దరు ఎమోషన్స్ పండించి ఆడియన్స్‌ చేత కంటతడి పెట్టించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆకట్టుకున్న ఈ చిత్రం థియేట్రికల్‌ రన్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రిమియర్‌కు రెడీ అయ్యింది. రిలీజ్‌కు ముందే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ పూర్తి కావడంతో సత్యం సుందరం మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయబోతోంది నెట్‌ఫ్లిక్స్‌. అక్టోబర్‌ 25న ఈ సినిమా అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రిమింగ్‌ కానుంది. థియేటర్లో విడుదలై విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాదు ఎంతోమంది ఆడియన్స్‌ ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో డిజిటల్‌ ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version