Jupally Krishna Rao Counter to Harish Rao: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. మల్లన్నసాగర్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రాష్ట్ర ఆదాయం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు, అవినీతి.. ఎవరెంత దోచుకున్నారో ఆ పార్టీ నేతలకు చర్చించేందుకు తాను సిద్దమన్నారు. ఆ పార్టీ నేతల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. మరి తనతో చర్చ జరిపేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ఎవరోస్తారో రావాలని సవాలు విసిరారు.
దీనిపై ఎల్పీ స్టేడియంలో ప్రజలు, మీడియా ముందే చర్చ పెడదామన్నారు. మల్లన్నసాగర్‌పై చర్చకు రావాలని హరీష్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని సవాలు చేశారని, ఆయన సవాల్‌కు సీఎం రావాల్సిన అవసరం లేదన్నారు. ఆయన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానన్నారు. పదేళ్ల పాలనలో కేఈసార్, కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్‌ఎస్ ేతల ాయం ఎంత ెరిగింది, దేశంలోనే సంపన్న ప్రాంతీయ పార్టీగా ఆ పార్టీ ఎలా ఎదిగింది.. ఇతర రాష్ట్రాల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని జూపల్లి ధ్వజమెత్తారు.