Site icon Prime9

Alia Bhatt: అలియా భట్‌ మూవీ డిజాస్టర్ – ట్విట్టర్ అకౌంట్‌ డిలీట్‌ చేసిన డైరెక్టర్‌, అసలేం జరిగిందంటే..!

Jigra Director Delets Twitter Account

Jigra Director Delets Twitter Account: అలియా భట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ జిగ్రా. రిలీజ్‌ ముందు జిగ్రా ప్రమోషన్స్‌ జోరు మామూలుగా లేదు. చిత్ర బృందం చేసిన హడావుడి ఇంతఅంతా కాదు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాలయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం బ్రేక్‌ ఈవెన్‌ కూడా సాధించలేకపోయింది. మొత్తం ఈ సినిమా రూ. 25పైగా కోట్ల గ్రాస్‌ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్‌ చూసి అంతా మూవీ హిట్‌ అనుకున్నారు. కానీ థియేటర్లో చూశాక ఇదోక చెత్త సినిమా అంటూ ఆడియన్స్‌ నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు.

అంతేకాదు ఈ మూవీ విషయంలో డైరెక్టర్‌పై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో డైరెక్టర్‌ వాసన్‌ బాలా షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న దారుణమైన ట్రోలింగ్‌, విమర్శలు వస్తుండటంతో ఏకంగా తన ట్విట్‌ ఖాతాను డిలిట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఎక్స్‌లో ఆయన ప్రొఫైల్‌ సెర్చ్‌ చేస్తుండగా యాక్టివ్‌లో లేనట్టు చూపిస్తుంది. దీంతో జిగ్రా ప్లాప్‌తోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున్న ఆయనపై ట్రోల్స్‌ రావడం వల్ల తన ట్విటర్‌ ఖాతా డియాక్టివేట్‌ చేశారంటూ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. అలియా భట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఇందులో అలియా భట్‌ రక్షితగా హీరోకి అక్క పాత్రలో కనిపించింది. బాలీవుడ్‌ నటుడు వేదాంగ్ అలియాకు సోదరుడిగా నటించాడు.

Exit mobile version