Site icon Prime9

Jeff Bezos: ప్రియురాలితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమెజాన్ ఫౌండర్

Jeff Bezos

Jeff Bezos

Jeff Bezos: మల్టీ బిలియనీర్, అమెజాన్‌ ఫౌండర్ జెఫ్‌ బెజోస్‌ ఆయన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌తో ఎట్టకేలకు రింగ్స్ మార్చుకున్నట్టు సమాచారం. వీరద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్‌ పెట్టుకున్న హార్ట్ సింబల్ ఉంగరంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి.

దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ యాచ్ ‘కోర్’ లో జెఫ్ బెజోస్.. లారెన్ కు ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం రింగ్ తో ఉన్న లారెన్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ రింగ్ ధర సుమారు 2.5 మిలియన్ డాలర్లని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్ లో ఉన్నారు. స్టార్స్ కి ఇచ్చే పార్టీకి ఖరీదైన బోటులో కేన్స్ కు చేరుకున్నారు. గతంలో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట అయిన సాంచెజ్, బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం లారెన్ దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్‌ (Jeff Bezos), లారెన్‌ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు.

25 ఏళ్ల బంధానికి బ్రేక్(Jeff Bezos)

బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి బ్రేక్ చెబుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరివురికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్‌, బెజోస్ తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

బెజోస్‌ నుంచి తన భార్య మెకంజీ 38 బిలియన్‌ డాలర్లు భరణంగా పొందారు. దీంట్లో సగం దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చేసారు. మరోవైపు లారెన్‌ కు గతంలో పాట్రిక్‌ వైట్‌సెల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరివురికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తో కూడా ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది.

 

Exit mobile version