Site icon Prime9

Pawan Kalyan-Akira: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ – అకిరా ఎంట్రీకి రంగం సిద్ధం? ఈ సినిమాతోనే లాంచ్‌!

Akira Nandan Guest Role in OG

Akira Nandan Guest Role in OG

Akira Nandan is Set to Make Debut into a Movies: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆయన రాజకీయాలపై ఫోకస్‌ పెడుతున్నారు. అయితే త్వరలోనే ఆయన కాస్తా రాజకీయాలకు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆయన సెట్లో అడుగుపెడతారా అని ఇటూ డైరెక్టర్స్ అటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాల తర్వాత పవన్‌ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడనే ప్రచారం ఉంది. అయితే పవన్‌ నటవారసుడిగా అకిరా సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా? అని మెగా ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

గెస్ట్ రోల్

ఇదిగో అకిరా ఎంట్రీ అంటూ ఎంతోకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇవి ప్రచారం వరకే పరిమితం అయ్యాయి. ఇదే విషయాన్ని అకిరా తల్లి, నటి రేణు దేశాయ్‌కి సైతం తరచూ ఫ్యాన్స్‌ నుంచి ప్న ఎదురవుతుంది. ఈ విషయంలో రేణు ఫ్యాన్స్‌పై ఎప్పుడు సీరియస్‌ అవుతూనే ఉంటుంది. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగొద్దని, తన కొడుకుపై మీ ఇష్టాన్ని రుద్దొద్దంటూ హెచ్చరిస్తుంది. కానీ, అకిరాని హీరోగా చూడాలనేది పవర్‌ స్టార్‌ ప్యాన్స్‌ ఆశ. ప్రస్తుతం అకిరా హీరో ఎంట్రీపై ఎన్స్ సందేహాలు ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కి ఓ కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అతి త్వరలోనే అకిరా నందన్‌ వెండితెర ఎంట్రీకి అంతా సిద్ధమైంది. అయితే హీరోగా మాత్రం కాదని తెలుస్తోంది. తన తండ్రి పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీలో గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నాడని ఇండస్ట్రీలో గుసగుస.

ఇంతకి ఆ సినిమా ఏంటంటే.. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం తన బాధ్యతలను నిర్వహిస్తూనే తాన సంతకం చేసిన సినిమాల షూటింగ్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ'(ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌)తో పాటు డైరెక్టర్‌ హరీష్ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాలకు సంతకం చేశారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలపై ఫోకస్‌గా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఓజీపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఏపీ రాజకీయాల న నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల మళ్లీ మొదలైంది. త్వరలోనే ఈ సినిమా సెట్లో పవన్‌ కూడా అడుగుపెట్టబోతున్నారు.

అకిరా పాత్ర ఇదే!

జపాన్‌ గ్యాంగస్టర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్‌ తనయుడు అకిరా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. తన సినిమాతోనే తనయుడి ఇండస్ట్రీలో లాంచ్‌ చేయాలని పవన్‌ ప్లాన్‌ చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి డైరెక్టర్‌ సుజిత్ పట్టుబట్టి అకిరాను తన చిత్రంలో నటించేలా పవన్‌ ఒప్పించారనేది టాక్‌. అంతేకాదు అకిరా పాత్రను పవన్‌కు వినిపంచడంతో ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దాంతో ఓజీలో అకిరా నందన్‌ గెస్ట్‌ రోల్‌ ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో అకిరా.. తన తండ్రి పవన్‌ టినేజ్ వయసు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలం కొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే. అయితే ఈ అప్‌డేట్‌ మాత్రం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ని తెగ ఖుషీ చేస్తోంది. ఇదే నిజం అయితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar