Site icon Prime9

Chalaki Chanti : జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

interesting details about chalaki chanti health

interesting details about chalaki chanti health

Chalaki Chanti : తెలుగు చిత్ర సీమలో తనదైన శైలిలో నటిస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు “చలాకీ చంటి”. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు చంటి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చంటి శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. గుండెనొప్పికి గురైన చంటిని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వార్త నిజమో కాదో ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంటి.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ కామెడీ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో మధ్యలో ‘జబర్దస్త్’ షోను విడిచిపెట్టినా.. అప్పుడప్పుడు మళ్ళీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇస్తుండేవాడు. ఆ తర్వాత ఈటీవీ ప్లస్‌‌లో ప్రసారమైన ‘నా షో నా ఇష్టం’ షో కు యాంకర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ సీజన్-6 లో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినా.. చివరి వరకు నిలవలేకపోయాడు. అయితే ఇటీవల చంటి సినిమాల్లో గానీ, టీవీ షోస్‌లో గానీ కనిపించడం లేదు. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అంటున్నారు.

లాస్ట్ ఇయర్  టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 6లో  పాల్గొన్నారు చలాకి చంటీ. కానీ ఆయన బిగ్ బాస్ లో చివరి వరకూ ఉండలేదు. కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి వచక్చిన తరువాత పెద్దగా స్క్రీన్ పూ కనిపించలేదు చంటి.  ఒకటి, రెండు షోస్ తప్పించి పెద్దగా  కనిపించడమే మానేశారు. ఒక రకంగా  పూర్తిగా స్క్రీన్ కు దూరమైపోయారు.

Exit mobile version