Prime9

Rink Singh : ఘనంగా భారత క్రికెటర్ రింక్ సింగ్ నిశ్చితార్థం

Indian cricketer Rink Singh : సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో భారత క్రికెటర్ రింక్ సింగ్ రిసెప్షన్ జరిగింది. లఖ్‌నవూలోని సెంట్రమ్ హోటల్‌లో నిశ్చితార్థం జరుగగా, మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ పాల్గొన్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్‌గోపాల్, కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ శుక్లా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ ఏడాది నవంబర్ 18న వివాహం..
ఈ ఏడాది నవంబర్ 18న వారణాసిలో సంప్రదాయబద్ధంగా రింక్, ప్రియ పెళ్లి జరగనుంది. క్రికెట్, బాలీవుడ్, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించనున్నారు. 27 ఏళ్ల రింక్ సింగ్ రెండు వన్డేలు, 33 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 26 ఏళ్ల ప్రియ యూపీలోని మచిలీషహర్ నుంచి సమాజ్‌వాది పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రియ గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.

Exit mobile version
Skip to toolbar