Site icon Prime9

Honda Shine 100cc: మార్కెట్ లోకి హోండా షైన్ 100 సీసీ బైక్ .. ధర ఎంతో తెలుసా?

Honda Shine 100cc

Honda Shine 100cc

Honda Shine 100cc: టూవీలర్ మార్కెట్‌లో హీరో తర్వాత హోండా కంపెనీని అదే స్థాయిలో క్రేజ్ ఉంది. తాజాగా హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ క్రమంలోనే అదే మోడల్‌ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా కంపెనీ కొత్త బైక్‌ను లాంచ్ చేసింది.

 

ధర ఎంతంటే..?(Honda Shine 100cc)

హోండాకు కంపెనీకి చెందిన 125 సీసీ ఆ పైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి.

అయితే 100సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉందనే చెప్పుకోవచ్చు. అయితే హీరో కంపెనీలోని 100 సీసీ రేంజ్‌ బైక్‌ల అమ్మకాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

దానికి కారణం హీరో స్ల్పెండర్‌ బైక్‌లు. ఈ నేపథ్యంలోనే హీరోకు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండాలో బాగా పాపులరైన షైన్‌ పేరుతో 100 సీసీ మోటర్‌ సైకిల్‌ తీసుకొచ్చింది.

దీని ప్రారంభ ధర రూ. 64,900 (ఎక్స్‌షోరూం). ఇది హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ కంటే తక్కువే..

 

7000 रुपये सस्ती, Splendor को टक्कर... Honda की नई बाइक लॉन्च - All New Honda  Shine 100 Launch in India Price Starts at Rs 64900 will rival Hero Splendor  tutd - AajTak

ఫీచర్స్ ఇవే..

హోండా షైన్ 100 సీసీ బైక్‌ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో రానుంది.

ఇందులో మూడేళ్లు సాధారణ వారంటీ కాగా 3 సంవత్సరాల ఎక్స్‌టెండెట్‌ వారంటీ అని కంపెనీ వెల్లడించింది.

677 మి.మీ లతో పొడవాటి సీటు, చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో కూడిన ట్యాంక్ ఈ కొత్త వెర్షన్ లో ఉన్నాయి.

ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్‌ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్‌ వేసి ఉన్నప్పుడు ఇంజిన్‌ స్టార్ట్ చేయడానికి వీలు పడదు.

హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్‌)ను ఈ 100 సీసీ బైక్‌లోనూ చేర్చింది కంపెనీ.

మరో వైపు డిజైన్‌ విషయానికొస్తే హోండా షైన్ 125 మాదిరిగానే.. ఈ 100 సీసీ కూడా ఉంటుంది.

అయితే అలాయ్‌ వీల్స్‌ లాంటి చిన్న చిన్న చేంజెస్ చేశారు. హోండా షైన్ 100 సీసీ బైక్‌ 5 రంగుల్లో లభ్యం అవుతోంది.

బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ , బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రీన్ కలర్స్ లో అందబాటులో ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar