High Court: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని అదేశించింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందేనని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్ కు చెందిన న్యాయవాది దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హై కోర్టు విచారణ జరిపింది.
దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొంది.
ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉందని తెలిపిన ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇరు వాదనలు విన్నా హై కోర్టు ఈ సూచనలు చేసింది.
గణతంత్ర వేడుకల నిర్వహణంపై.. హై కోర్టు కు ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.
ఈనెల 13వ తేదీన రాజ్‌భవన్‌కు లేఖ రాశామని.. కొవిడ్ ఉన్నందున రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని తెలిపినట్లు పేర్కొన్నారు.
రాజ్ భవన్ లో నిర్వహించే వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.
రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలను వెబ్ కాస్టింగ్ చేస్తామని పేర్కొన్నారు.
వాదనల అనంతరం న్యాయస్థానం.. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై కీలక సూచన చేసింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కడ ఉందో చెప్పాలని హై కోర్టు TS High Court ప్రశ్నించింది.
ఈ విషయాలను తాము పరిగణలోకి తీసుకోమని హై కోర్టు స్పష్టం చేసింది.
గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది.
గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలన్న హైకోర్టు .. పరేడ్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బి ఆర్ కే భవన్ లో గణతంత్ర వేడుకలపై ముగిసిన సిఎస్ సమీక్ష.
ఎక్కడ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయం.
జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయల్లో గణంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/