Health Tips: ఈ ఆహారం తీసుకుంటే జీవితంలో రోగాలు దరిచేరవు!

Healthy Eating is disease free: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అందరూ ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్నారు. కనీసం కూర్చోని తినేందుకు సైతం సమయం దొరక్క వారి వారి పనుల్లో విలీనమవుతున్నారు. మరోవైపు తినే ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి రోగాలు దరిచేరవు.

ఉదయం లేచిన వెంటనే పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడంతో కండరాల నొప్పులు రాకుండా ఉండడంతోపాటు రక్తనాళాల్లో రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. అలాగే నిత్యం 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా బ్రోకలీ, మిరియాలు, బ్రస్సెల్ మొలకలు, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటారు. దీంతో పాటు తృణధాన్యాలు తీసుకోవాలి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గోధుమలు, ఓట్స్, మిల్లెట్స్ వంటివి తీసుకోవాలి.

రోజూ తీసుకునే ఆహారంలో కనీసం వారానికోసారి బీన్స్ ఉండేలా చూసుకోవాలి. బీన్స్ తో పాటు సలాడ్స్, సూప్స్, చిక్కుళ్లు, క్యాస్రోల్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే శరీరానికి మాంసకృతులు చాలా అవసరం. శరీర పెరుగుదల, కణజాలల నిర్మాణానికి మాంసకృతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వారంలో రెండుసార్లు చికెన్, చేపలు, బీన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్యవంతమైన జీవితం కోసం బాదం, వాల్ నట్స్, చియా గింజలు, అవిసె, గుమ్మడికాయ గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. దీంతో పాటు ఆలివ్ ఆయిల్, అవకోడో, సాల్మన్ వంటి చేపల్లో లభించే కొవ్వులతో గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. అందుకే చేపలను వారానికి మూడు నుంచి నాలుగు తింటే మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు.

బటర్ నట్, అకార్న్ స్వ్కాస్ లతో పాటు తీపి బంగాలదుంప, సీతాఫలం, మామిడి, ముదురు నారింజ, ఆకుపచ్చ రంగు కూరగాయాలను తీసుకోవాలి. అలాగే, బెర్రీ ఫ్రూట్స్, సోయా మిల్క్, సోయాబీన్స్, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.